జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో(Jubilee Hills By Elections) భాగంగా పోలింగ్ స్టేషన్ల నుంచి ఎన్నికల సిబ్బంది ఈవీఎంలను(EVM) యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో(Kotla Vijay Bhaskar Reddy Stadium) ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్(Strong Room) తరలించారు. కేంద్ర సాయుధ బలగాల(Central Armed Forces) భద్రత నడుమ కేటాయించిన రూట్లలో(Route) ప్రత్యేక బస్సుల్లో సిబ్బంది ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో భద్రంగా చేర్చారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో పటిష్ఠ భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు.
- Advertisement -
