Wednesday, March 4, 2026
Homeకెరీర్ న్యూస్SaiChaithra | జర్నలిస్ట్ కూతురికి 2 గోల్డ్ మెడల్స్

SaiChaithra | జర్నలిస్ట్ కూతురికి 2 గోల్డ్ మెడల్స్

సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని వెల్లడి

కరీంనగర్, నవంబర్ 7 (ఆదాబ్ హైదరాబాద్): సీనియర్ జర్నలిస్ట్ (Senior Journalist) కామినేని మధుసూదన్ కూతురు కామినేని సాయిచైత్ర.. డిగ్రీ, పీజీలో ఉత్తమ ప్రతిభ (Best Talent) కనబరచటం ద్వారా రెండు గోల్డ్ మెడల్స్ (Gold Medals) పొందారు. కరీంనగర్‌‌కు చెందిన ఆమె.. నగరంలోని వివేకానంద డిగ్రీ కాలేజీలో చదివారు. డిగ్రీలో బీబీఎం, పీజీలో ఎంబీఏ చేశారు. శాతవాహన యూనివర్సిటీ (Satavahana University) స్థాయిలో బెస్ట్ ర్యాంకులు (Ranks) సాధించారు. యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన రెండో స్నాతకోత్సవం(Convocation)లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ (Governor) జిష్టుదేవ్‌వర్మ (Jishtudev Varma) చేతుల మీదుగా 2 బంగారు పతకాలు అందుకున్నారు. వివేకానంద డిగ్రీ కాలేజీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి సాగర్.. సాయిచైత్రను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. సివిల్స్ (Civils) సాధించడమే తన లక్ష్యమని వెల్లడించారు. తల్లిదండ్రులు కామినేని మధుసూదన్, సరిత ప్రోత్సాహం వల్ల పట్టుదలతో చదుకోగలిగానని చెప్పారు. సహకరించిన అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News