Monday, January 19, 2026
EPAPER
Homeకెరీర్ న్యూస్YIL | యంత్ర ఇండియా లిమిటెడ్‌లో 3979 అప్రెంటీస్‌లు

YIL | యంత్ర ఇండియా లిమిటెడ్‌లో 3979 అప్రెంటీస్‌లు

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆర్డనెన్స్(రక్షణ), ఆర్డనెన్స్ ఎక్విప్‌మెంట్(రక్షణ పరికరాల) ఫ్యాక్టరీల్లో ట్రేడ్ అప్రెంటీస్‌ల(apprentices) నియామకానికి యంత్ర ఇండియా లిమిటెడ్(yantra india limited) సంక్షిప్త ప్రకటన వెలువడింది. ఇందులో నాన్ ఐటీఐ(Non ITI) కేటగిరీలో 1136, ఎక్స్ ఐటీఐ(Ex ITI) కేటగిరీలో 2843 ఖాళీలు ఉన్నాయి. నాన్ ఐటీఐ కేటగిరీకి పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హత కలిగినవారు అర్హులు. ఎక్స్ ఐటీఐ కేటగిరీలో సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి. పూర్తి వివరాలతో కూడిన ప్రకటన recruit-gov.comలో అందుబాటులో ఉంచుతారు. ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ ఫిబ్రవరిలో ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. www.apprenticeship.gov.inలో ఇప్పటికే దరఖాస్తు చేసినవాళ్లు కూడా recruit-gov.comలో మళ్లీ అప్లై చేయాల్సి ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News