Wednesday, February 25, 2026
Homeక్రైమ్ వార్తలుArrest | జేఎన్‌టీయూ హెచ్‌ఓడీ అరెస్ట్

Arrest | జేఎన్‌టీయూ హెచ్‌ఓడీ అరెస్ట్

గెస్ట్ ఫ్యాకల్టీ సభ్యురాలి(Guest Faculty Member)పై అఘాయిత్యానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో సైబరాబాద్ పోలీసులు (Cyberabad Police) JNTU-హైదరాబాద్ విభాగాధిపతి(HoD)ని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు(Victim’s Complaint)తో నిందితుడిపై కేసు నమోదు చేసిన కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ(KPHB) పోలీసులు అతణ్ని అరెస్టు చేసిన అనంతరం జ్యుడీషియల్ కస్టడీ(Judicial Custody)కి తరలించారు. HoD వయసు సుమారు 54 ఏళ్లు. బాధితురాలు 5 నెలల కిందటే JNTUలో గెస్ట్ ఫ్యాకల్టీగా చేరారు.

అప్పటి నుంచి అతను ఆమెతో సన్నిహితంగా మెలుగుతున్నాడు. ఏ సాయం కావాలన్నా చేస్తానని చెప్పాడు. కానీ.. ఆమె అతడికి దూరంగా ఉండటానికి ప్రయత్నించారు. దీంతో.. సర్వీస్ నుంచి తొలగిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఒక రోజు ఆ HOD ఓ సమస్య గురించి చర్చించాలనే సాకుతో బాధితురాలిని తన కారులో ఎక్కించుకొని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. బాధితురాలు KPHB పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News