Thursday, February 5, 2026
Homeకెరీర్ న్యూస్JEE | జే.ఈ.ఈ. మెయిన్స్ సెషన్ 1 కీ విడుదల..

JEE | జే.ఈ.ఈ. మెయిన్స్ సెషన్ 1 కీ విడుదల..

  • ఈ నెల 6వ తేదీ వరకు అభ్యంతరాలు తెలుపవచ్చు..
  • ఈ నెల 12 నాడు ఫలితాలను విడుదల చేస్తామన్న అధికారులు..

జనవరి 21 నుంచి 29 వరకు జరిగిన సెషన్-1 జె.ఈ.ఈ. మెయిన్స్ 2026 పరీక్ష ప్రొవిజనల్‌ కీ విడుదలైంది. జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 ప్రొవిజనల్‌ ఆన్సర్‌ కీతోపాటు రెస్పాన్స్‌ షీట్లను ఎన్.టి.ఏ. ఈరోజు విడుదల చేసింది. దీనిపై ఈ నెల 6వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. కీ పేపర్‌, రెస్పాన్స్‌ షీట్లను కేంద్ర ప్రభుత్వం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హైయర్‌ ఎడ్యూకేషన్‌ వెబ్‌సైట్లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ మెయిన్‌ పరీక్షకు సంబంధించిన అప్లికేషన్‌ నెంబర్‌, పాస్‌వర్డ్‌తో పాటు ఇతర వివరాలను ఎంటర్‌ చేసి ఆన్సర్‌ కీని చూసుకోవచ్చు.

ఈ ఆన్సర్‌ కీలో ఏవైనా తప్పులున్నాయని అభ్యంతరాలు లేవెనెత్తాలంటే అభ్యర్థులు ఒక్కొ ప్రశ్నకు 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇవి నాన్‌ రీఫండబుల్‌. ఫిబ్రవరి 6 అర్థరాత్రి 12 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించిన తరువాత ఫైనల్‌ ఆన్సర్‌ కీని విడుదల చేస్తారు. ఈ నెల 12న జే.ఈ.ఈ. మెయిన్స్ 2026 రిజల్ట్స్ ను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా దాదాపు 13 లక్షల మందికి పైగా విద్యార్థులు జేఈఈ మెయిన్‌ పరీక్షను రాశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News