Thursday, March 5, 2026
Homeఎన్‌.ఆర్‌.ఐJapan | జపాన్ నోట‌.. తెలుగు మాట‌..

Japan | జపాన్ నోట‌.. తెలుగు మాట‌..

భాగ‌స్వామ్య స‌ద‌స్సులో ఆ దేశ రాయ‌బారి తెలుగు ప్ర‌సంగం
తెలుగువారికి కృత‌జ్ఞ‌త‌లు
తెలుగులో ఇదే నా మొద‌టి ప్ర‌సంగం
ట్విట్ట‌ర్ వేదిక‌గా భావోద్వేగాన్ని పంచుకున్న జ‌పాన్ రాయ‌భారి ఓనో కీచ్చి

విశాఖ‌ప‌ట్నంలో జ‌రుగుతున్న పెట్టుబ‌డుల స‌ద‌స్సు (Vishaka Summit) వివిధ దేశాల్లోని పెట్టుబ‌డిదారుల‌ను ఆకట్టుకోవ‌డ‌మే కాదు. మ‌న తెలుగు భాష (Telugu Language) కూడా వారిని ఆక‌ట్టుకుంటోంది. ప‌రాయి దేశ‌స్తులైనా క‌ష్ట‌మైన కొంత‌ మంది తెలుగు భాష మాధుర్యాన్ని చ‌విచూస్తూ సంబ‌ర‌ప‌డిపోతున్నారు. త‌మ‌కు క‌ష్ట‌మైనా త‌మ నోటి నుంచి కొన్ని తెలుగు మాటలు ప‌లికి ప‌ర‌మానంధ‌భ‌రితుల‌వుతున్నారు.

- Advertisement -

ఇక జాప‌న్ రాయ‌బారి (Japanese Ambassador) ఓనో కిచ్చీ (Ono Kichi) అయితే ఏకంగా తెలుగులోనే ప్ర‌సంగం ప్రారంభించి అంద‌ర్నీ ఆశ్చ‌ర్యచ‌కితుల్ని చేశారు. జ‌పాన్ దేశ‌ంతో వాణిజ్య సంబంధాల‌పైన ఆయ‌న సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సు(CII Summit)లో ప్ర‌సంగిస్తూ తెలుగులో ప్ర‌సంగించి అంద‌ర్నీ ఆశ్చ‌ర్యపరిచారు.

ఈ రోజు సీఐఐ భాగస్వామ్య స‌ద‌స్సులో పాల్గొన్నందుకు నేను చాలా గౌర‌వంగా భావిస్తున్నాను. ఈ అద్భుత‌మైన కార్య‌క్ర‌మం ద్వారా జ‌పాన్, ఇండియా (India) కంపెనీల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం అందిపుచ్చుకోవ‌డంపై నేను సంతోషిస్తున్నాను.. అంటూ తెలుగులో మాట్లాడి అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురిచేశారు. అంతే కాదు. తెలుగు భాష‌పై త‌న‌కున్న అభిమానాన్ని ఆయ‌న భావోద్వేగ‌భ‌రితంగా త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా పంచుకున్నారు.

న‌న్ను ఆహ్వానించినందుకు కృత‌జ్ఞ‌త‌లు అంటూ తెలుగులో ట్వీట్ చేసి, తెలుగులో ఇదే నా మొద‌టి ప్రసంగ‌మ‌ని తెలిపారు. జ‌పాన్ ఏపీల మ‌ధ్య వాణిజ్య సంబంధాలు ఈ స‌ద‌స్సు ద్వారా మ‌రింత బ‌లోపేత‌మ‌వుతాయ‌ని తెలిపారు. స్టీల్, ఫార్మా, రిన్యూవ‌బుల్ ఎన‌ర్జీ, శ్రీసిటీ, ట‌యోమా ప్రీఫెక్చూర్ లాంటి రంగాల్లో వాణిజ్య స‌హ‌క‌రం కొన‌సాగిస్తున్నామ‌ని, ఈ స‌దస్సు ద్వారా జ‌పాన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ల మ‌ధ్య ఈ స‌హ‌కారం బ‌లోపేత‌మై మ‌రింత‌గా కొన‌సాగుతుంద‌ని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News