తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన జనవరి టికెట్లను అక్టోబర్ 19వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం అక్టోబర్ 21వ తేదీ ఉదయం 10 గంటల దాక నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందినవాళ్లు అక్టోబర్ 21 నుంచి 23 వరకు మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బు చెల్లించాలి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను అక్టోబర్ 23న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటానూ అక్టోబర్ 23న మధ్యాహ్నం 3 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లు ఉచితంగా దర్శనం చేసుకునేందుకు టికెట్లను ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25న ఉదయం 10 గంటలకు, గదుల కోటాను 25న మధ్యాహ్నం 3 గంటలకు విడదల చేస్తారు. టికెట్లను https://ttdevasthanams.ap.gov.in/home/dashboardలో బుక్ చేసుకోవచ్చు
TIRUMALA: జనవరి కోటా టికెట్ల విడుదల తేదీలు
RELATED ARTICLES
- Advertisment -
