Sunday, February 22, 2026
Homeఆంధ్రప్రదేశ్T-Hubలో జక్కా వెంకటేశంకు AI గ్రాడ్యుయేషన్ పట్టా

T-Hubలో జక్కా వెంకటేశంకు AI గ్రాడ్యుయేషన్ పట్టా

సంగారెడ్డికి చెందిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి జక్కా వెంకటేశం, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ 2.0ను విజయవంతంగా పూర్తి చేశారు. జూలై 26, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని జక్కా వెంకటేశంకు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.

ఈ సందర్భంగా జక్కా వెంకటేశం మాట్లాడుతూ, “చదువుకునే వయసులోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక టెక్నాలజీపై పట్టు సాధించడం నా భవిష్యత్ లక్ష్యాలకు ఎంతో బలాన్నిస్తుంది. ఈ బూట్ క్యాంప్ నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇక్కడ నేర్చుకున్న నైపుణ్యాలను నా ఉన్నత చదువుల్లో ఉపయోగించుకొని, టెక్నాలజీ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకుంటున్నాను. ఇంత చిన్న వయసులోనే నాకు ఈ అవకాశం కల్పించిన డిజిప్రెన్యూర్ టీమ్‌కు, నికీలు గుండ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.

- Advertisement -

తరువాతి తెలుగు AI బూట్ క్యాంప్ 2.0 ఆగస్టు 11, 2025న ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలకు ఈ నంబర్లను సంప్రదించండి: 733 111 2687, 733 111 2686, 733 111 2688.

- Advertisement -
RELATED ARTICLES

Latest News