Tuesday, February 10, 2026
Homeరంగారెడ్డిRSP Party | జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన..

RSP Party | జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన..

  • రాష్ట్ర సామాన్య ప్రజా పార్టీ అధ్యక్షులు కంటెస్టెడ్ మేడ్చల్ ఎమ్మెల్యే జాకట శ్రీనివాస్

77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్‌లోని రాష్ట్ర సామాన్య ప్రజా పార్టీ ప్రధాన కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు కంటెస్టెడ్ మేడ్చల్ ఎమ్మెల్యే జాకట శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ముందుగా ఆయన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం సమర్పించారు.ఈ సందర్భంగా జాకట శ్రీనివాస్ మాట్లాడుతూ:

“భారతదేశం గర్వించదగ్గ రాజ్యాంగాన్ని మనకు అందించిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాల్సిన రోజిది అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే నేడు సామాన్యులకు సైతం సమాన హక్కులు, స్వేచ్ఛ లభిస్తున్నాయి అని తెలిపారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా, సామాన్య ప్రజల గొంతుకగా నిలవడమే మన పార్టీ ప్రధాన లక్ష్యం. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకుంటూ, బాధ్యతగల పౌరులుగా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి” అని పిలుపునిచ్చారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి అనగాల రాములు, నాయకులు నీరుడి ప్రేమ్ దాస్, కే వెంకటేష్, నీరుడి సందీప్ కుమార్, రాహుల్ సాయి రెడ్డి, మాలిక్, శ్రీకాంత్ పాశ్వాన్, లలన్ కుమార్, సిహెచ్ కృష్ణ, టి రమేష్, ఉపేందర్, సంతోష్, వీరేందర్ కుమార్ యాదవ్, సుమిత్, మహేందర్ గౌడ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News