ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (Ys Jagan) ఈ రోజు సీబీఐ (CBI) విచారణకు హాజరయ్యారు. నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి ఎదుట విచారణకు వచ్చారు. విజయవాడ (Vijayawada) నుంచి బేగంపేట్ (Begumpet) విమానాశ్రయానికి, అక్కడి నుంచి నాంపల్లి(Nampalli)కి వచ్చి, అనంతరం బంజారాహిల్స్(Banjarahills)లోని లోటస్ పాండ్(Lotus Pond)కు చేరుకున్నారు. ఆస్తుల కేసు(Assets Case)లో జగన్ 2013 నుంచి బెయిల్ మీదే ఉన్నారు. ఆరేళ్లుగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందుతున్నారు. ఇప్పుడు కూడా ఇదే అడగటంతో సీబీఐ వ్యతిరేకించింది. డిశ్చార్జ్ వ్యాజ్యాలపై రోజువారీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యక్షంగా హాజరవ్వాలని సీబీఐ వెల్లడించింది. దీంతో ఈ నెల 21న వస్తానని చెప్పిన జగన్ ఒక రోజు ముందుగానే హాజరయ్యారు.
Ys Jagan | సీబీఐ విచారణకు జగన్ హాజరు
- Advertisement -
RELATED ARTICLES
