జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ‘మీట్ ది ప్రెస్’లో సీఎం రేవంత్ వ్యాఖ్యలు
తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) మరో తొమ్మిదేళ్లు.. అంటే.. 2034 జూన్ వరకు అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. రాష్ట్రంలో తదుపరి శాసన సభ ఎన్నికలు (Assembly Elections) 2028 డిసెంబర్‌లో జరగవని అన్నారు. జమిలీ (Jamili) ఎన్నికలు 2029 జూన్‌లో జరుగుతాయని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్(Hyderabad Press Club)లో ఆదివారం జరిగిన ‘మీట్ ది ప్రెస్’(Meet The Press)లో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ (Bjp) డిపాజిట్ (Deposit) దక్కించుకుంటే దేశం మొత్తం గెలిచినట్లేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలుచేస్తున్న పలు కార్యక్రమాలను వివరించారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు.
