Thursday, March 26, 2026
Homeజాతీయందేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్లు

దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్లు

సంవిధాన్ హత్య దివస్‌గా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

నేటికి సరిగ్గా 50 ఏండ్ల కిందట అధికార దాహం, పదవీ వ్యామోహం కమ్మి ఇందిరాగాంధీ దేశంలో “ఎమర్జెన్సీ” విధించారు. దీంతో ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీ కబందహస్తాల్లో నలిగిపోయి ఖూనీ అయిందని బీజేపీ విమర్శించింది. ప్రజాస్వామ్య భారతదేశ చరిత్రలో ఇదొక మాయని మచ్చగా, చీకటి అధ్యాయంగా నిలిచిపోయిందని పేర్కొంది. ఈ సంఘటనను, ఆ అంధకారం నుంచి దేశాన్ని కాపాడిన వీరుల పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ మోదీ ప్రభుత్వం ఇవాళ(జూన్ 25 బుధవారం) దేశవ్యాప్తంగా సంవిధాన్ హత్య దివస్‌గా ప్రకటించింది. 1975లో ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు 21 నెలల పాటు దేశ పౌరులు ఎదుర్కొన్న ఇబ్బందులు, ఇందిరాగాంధీ అరాచకత్వం నేటి తరానికి తెలియజెప్పడానికి బిజెపి దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News