Thursday, February 26, 2026
Homeఆరోగ్యంApple | యాపిల్ తింటే ఆరోగ్యమా.. అనారోగ్యమా..?

Apple | యాపిల్ తింటే ఆరోగ్యమా.. అనారోగ్యమా..?

  • విస్తుపోయే వాస్తవాలు తెలియజేసిన వైద్య నిపుణులు..

యాపిల్ తినడానికి సరైన సమయం ఏంటో డైటీషియన్ అంచల్ భాటియా చెప్పారు. యాపిల్ తినడానికి బెస్ట్ సమయం ఉదయం. అయితే, ఖాళీ కడుపుతో యాపిల్ తినకూడదు. ఖాళీ కడుపుతో యాపిల్ తింటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. యాపిల్‌ను ఉదయం పూటే బ్రేక్‌ఫాస్ట్‌తో తినాలని నిపుణులు సిఫార్స్ చేస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌తో యాపిల్ తినడం వల్ల రోజంతా ఎనర్జీ లెవల్స్ సమతుల్యంగా ఉంటాయి. మీరు కావాలనుకుంటే బ్రేక్‌ఫాస్ట్ చేసిన అరగంట తర్వాత తినొచ్చు. ఇక, మీరు వ్యాయామం చేసే ముందు ఒక యాపిల్ తినొచ్చు. అంతేకాకుండా మధ్యాహ్నం భోజనానికి ఓ 40 నిమిషాల ముందు యాపిల్ తినొచ్చు.

యాపిల్ పండును సరైన టైమ్‌లో తింటేనే ఆరోగ్యానికి మంచిది. రాత్రి పూట ఎట్టి పరిస్థితుల్లో యాపిల్ తినకూడదని అంచల్ అంటున్నారు. రాత్రిపూట యాపిల్ తినడం వల్ల జీర్ణక్రియ మందగించి గ్యాస్ లేదా అసిడిటీ వస్తుంది. అంతేకాకుండా మీ నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంటుంది. దీంతో నిద్రలేమి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. సాయంత్రం ఆరు గంటల తర్వాత యాపిల్ తినడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తాయి. అందుకే పగటి పూట మంచి ఆప్షన్.

- Advertisement -
RELATED ARTICLES

Latest News