- ఇండియన్ రైల్వే సర్వీస్ అఫ్ ఎలెక్ట్రిక్ ఇంజినీర్స్ 2002 బ్యాచ్ వారికి అవకాశం..
ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్స్ కు చెందిన 2002 బ్యాచ్ కు సంబంధించిన ఐదు మంది అధికారులు, కేంద్ర ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీ లేదా సమానమైన హోదా పదవుల నియామకానికి ఎంపిక చేయబడ్డారు.. ఇందులో ఆనంద్ చెక్కిళ్ళ, ప్రేమ్ చాంద్ లోచాబ్, సతీష్ కుమార్, సుమిత్ గార్గ్, విపిన్ పాల్ సింగ్ లు ఉన్నారు.. కాగా జాయింట్ సెక్రటరీ అనే హోదా వారికి అప్పగించిన శాఖ లేదా విభాగంలోని ఒక విభాగానికి సంబంధించి అవసరమైన స్థాయిలో స్వతంత్రంగా పని చేసే అధికారంతో పాటు, ఆ విభాగానికి సంబంధించిన సమగ్ర బాధ్యతను వహించాల్సి ఉంటుంది.. ఇంకా అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు నిర్వహించే జాయింట్ సెక్రటరీ, మంత్రిత్వ శాఖలోని తన విభాగానికి అధిపతిగా అన్ని పరిపాలనా అధికారాలను కలిగి ఉంటారు..
- Advertisement -
