Saturday, October 4, 2025
ePaper
Homeఅంతర్జాతీయంఇరాన్ సుప్రీంలీడర్‌ను చంపటం ఖాయం: ఇజ్రాయెల్

ఇరాన్ సుప్రీంలీడర్‌ను చంపటం ఖాయం: ఇజ్రాయెల్

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని చంపుతామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కాట్జ్ హెచ్చరించారు. ప్రతీకారం తీర్చుకుంటానని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రతినబూనిన కాసేపటికే కాట్జ్ ఇలా స్పందించటం గమనార్హం. హాస్పిటల్‌పై దాడికి ఖమేనీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఖమేనీని డైరెక్ట్‌గా టార్గెట్ చేసుకుంటామని తేల్చిచెప్పారు. ఇది యుద్ధ నేరమని, దీనికి ఖమేనీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కుండబద్ధలు కొట్టారు. ఆసుపత్రిపై దాడికి సంబంధించి ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ దీనికి ఇరాన్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. లేటెస్ట్‌గా.. సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని బీర్షెబా హాస్పిటల్‌పై ఇరాన్ దాడి చేసింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News