కరీంనగర్ రేకుర్తి లోని విజన్ హై స్కూల్ లో శనివారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవo సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ సిరిపురం ప్రసాద్ విచ్చేసి విద్యార్థులందరికీ మాతృభాష గొప్పతనాన్ని వివరించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థుల యొక్క వివిధ రకాల వేషధారణ లు, నాటికలు ,పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
విద్యార్థిని ,విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు నృత్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి .ఈ సందర్భంగా తెలుగు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు పాఠశాల కరస్పాండెంట్ సిరిపురం ప్రసాద్ విద్యార్థిని, విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ సందవేణి వెంకట్ , ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
