2026 జనవరి 13, 14, 15 తేదీల్లో అంతర్జాతీయ పతంగుల ఉత్సవం(International Kite Festival) హైదరాబాద్(Hyderabad)లోని పరేడ్ గ్రౌండ్స్(Parade Grounds)లో జరగనుంది. ఈ వేడుకల ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సమీక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాల మేరకు వచ్చే ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. సంక్రాంతి సమయంలో నిర్వహించే ఈ ఉత్సవాలను హైదరాబాద్ శక్తివంతమైన సంస్కృతి, పండుగ స్ఫూర్తిని ప్రతిబింబించేలా భారీ స్థాయిలో జరుపుతారు. హైడ్రా-పునరుజ్జీవింపజేసిన సరస్సుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీనికోసం ప్రత్యేక పేరు, బ్రాండింగ్, లోగో రూపొందిస్తారు. జీహెచ్ఎంసీ(GHMC), హెచ్ఎండీఏ(HMDA), హైడ్రా(HYDRAA) అధికారులు ఈ బాధ్యతలను స్వీకరిస్తారు.
ఈ ఏర్పాట్లను మంత్రులు జనవరి ప్రారంభం నుంచి సమీక్షిస్తారు. నగర శివార్లలో హాట్ ఎయిర్ బెలూన్ ఉత్సవం కూడా జరుగుతుంది. దేశం నలుమూలల నుంచి వచ్చే పైలట్లతో డ్రోన్ ఉత్సవం కూడా నిర్వహిస్తారు. ఈ సమీక్షా సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ TR&B వికాస్ రాజ్, కమిషనర్ హైడ్రా రంగనాథ్, HMDA కమిషనర్ సర్ఫ్‌రాజ్ అహ్మద్, GHMC కమిషనర్ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి, TSPDCL MD ముషారఫ్, తెలంగాణ టూరిజం ఎండీ క్రాంతి వల్లూరు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
