రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కోహెడలో ప్రతిపాదిత అంతర్జాతీయ చేపల ఎగుమతి మార్కెట్(International Export Fish Market)ను మత్స్య శాఖ మంత్రి(Fisheries Minister) వాకిటి శ్రీహరి(Vakiti Srihari) పరిశీలించారు. ఈ మార్కెట్‌ను దక్షిణ భారతదేశం(South India)లోని మరే ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా.. 13 ఎకరాల విస్తీర్ణంలో 47 కోట్ల రూపాయల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలకు (International Standards) అనుగుణంగా ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో చేపల దుర్వాసన రాకుండా పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ సదుపాయం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌ను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది అందుబాటులోకి వస్తే.. గోదావరి, కృష్ణా నదులతోపాటు తెలంగాణవ్యాప్తంగా ఉన్న 26 వేల జలాశయాల నుంచి చేపలను ఎగుమతి చేయడానికి వీలు కలుగుతుంది.
Koheda | అంతర్జాతీయ చేపల ఎగుమతి మార్కెట్
- Advertisement -
RELATED ARTICLES
