Tuesday, March 31, 2026
Homeకెరీర్ న్యూస్Intermediate | ఇక ఇంటర్ కాలేజీలు 224 రోజులు..

Intermediate | ఇక ఇంటర్ కాలేజీలు 224 రోజులు..

  • మార్గదర్శకాలు విడుదల చేసిన ఇంటర్ బోర్డు..

వచ్చే విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్‌ కాలేజీలను 224 పనిదినాలపాటు నడపాలని ఇంటర్‌బోర్డు ఆదేశించింది. 2026-27 వార్షిక విద్యా క్యాలెండర్‌ (అకాడమిక్‌ క్యాలెండర్‌)ను సోమవారం విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరంలో 226 పనిదినాలుండగా, వచ్చే విద్యాసంవత్సరానికి 224 పనిదినాలు ఖరారుచేసింది. కాలేజీలు జూన్‌ 1న పునఃప్రారంభమవుతాయని, అదే రోజు నుంచి ఫస్టియర్‌, సెకండియర్‌ విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయని ఇంటర్‌బోర్డు వెల్లడించింది.

కాలేజీలను 220 పనిదినాలపాటు నడపాలన్న బోర్డు సమావేశ నిర్ణయం మేరకు ఈ సారి 224 పనిదినాలపాటు కాలేజీలు నడపాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆదేశించారు. ఇంటర్‌ వార్షిక పరీక్షలను 2027 ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహిస్తామని కృష్ణ ఆదిత్య వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News