బాన్సువాడ(Banswada) పట్టణ కేంద్రంలో సోమవారం జరిగిన మహిళా సంఘాలకు(Women Selfhelp Groups) వడ్డీలేని రుణాల(Interest Free) రాయితీ పంపిణీ(Distribution of subsidy) కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి(Banswada Mla Pocharam Srinivas Reddy) పాల్గొన్నారు. 302 మహిళా సంఘాలకు రూ.86,93,000 వడ్డీలేని రుణ రాయితీ చెక్కును అందజేశారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎమ్మెల్యే సొంత నిధులతో హైదరాబాద్‌లో కొనుగోలు చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ యంత్రాలను(Food Processing Machinery) అప్పగించారు.
అంతకుముందు పట్టణంలోని 4వ వార్డులో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో సమర్థవంతమైన, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుణ్ని ఎన్నుకోవాలని సూచించారు. ఉదయం బీర్కూర్ మండల పరిధిలోని తిమ్మాపూర్ తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి వారిని దర్శించుకున్నారు. దేవస్థానం భూమిలో 2 ఎకరాలను మైదానం కోసం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.
