- భారత వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి అంకితమైన తొలి జాతీయ స్థాయి వేదిక..
- ఎల్.బీ. నగర్, కేబీఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఈనెల 7, 8, 9 తేదీల్లో నిర్వహణ..
- ఈవెంట్ పోస్టర్ ని ఆవిష్కరించిన ప్రముఖ సినీ నటుడు బాబూ మోహన్..
భారతీయ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ రంగాన్ని జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఇండియన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ అండ్ ఫోటోఫినా ఎక్స్‌పో 2026 హైదరాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.. ఈ ప్రతిష్టాత్మక మూడు రోజుల జాతీయ స్థాయి కార్యక్రమం ఫిబ్రవరి 07, 08, 09.. 2026 తేదీలలో కేబీఆర్ కన్వెన్షన్ సెంటర్, ఎల్‌బీ నగర్, హైదరాబాద్ లో జరగనుంది.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ నటుడు బాబు మోహన్ ఈ ఈవెంట్ పోస్టర్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. ఈ ఫెస్టివల్‌ను ఫోటో పరివార్ ఇండియా నెట్‌వర్క్ సమర్పిస్తుండగా, ఎడిట్‌పాయింట్ ఇండియా, ఫోటోటెక్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. భారతీయ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ రంగానికి ఒక ఐక్యమైన జాతీయ వేదికను అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.. .
సృజనాత్మకత, వ్యాపారానికి జాతీయ సంగమం :
గత దశాబ్దంలో భారతీయ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతూ, సృజనాత్మక రంగాల్లో అత్యంత విలువైన విభాగంగా మారింది. ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ఉన్న.. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్లు, సినీమాటోగ్రాఫర్లు, వీడియో ఎడిటర్లు, ఆల్బమ్ డిజైనర్లు, శిక్షకులు,
బ్రాండ్లు, టెక్నాలజీ ప్రొవైడర్లు.. అందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చే లక్ష్యంతో ఈ ఫెస్టివల్‌ను రూపొందించారు.
ఈ కార్యక్రమాన్ని ఇప్పలపల్లి రమేష్, అభిమన్యు రెడ్డి, భూపాల్ కుమార్, మధు, ఓం ప్రకాష్, కాశీ రత్నంల నాయకత్వంలో, పరిశ్రమలో అనుభవజ్ఞులైన బృందం నిర్వహిస్తోంది.
ఫెస్టివల్ ముఖ్య ఆకర్షణలు :
మూడు రోజుల పాటు సృజనాత్మకత, జ్ఞానం, వ్యాపారాభివృద్ధికి అంకితమైన కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
ముఖ్యాంశాలు :
సెమినార్లు, మాస్టర్ క్లాసులు :
ప్రముఖ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్లు, పరిశ్రమ నిపుణులచే క్రియేటివిటీ, స్టోరీటెల్లింగ్, బ్రాండింగ్, ప్రైసింగ్, క్లయింట్ మేనేజ్‌మెంట్, బిజినెస్ స్కేలింగ్ పై లోతైన సెషన్లు.
ప్యానల్ డిస్కషన్స్ :
కొత్త ట్రెండ్స్, ఫోటోగ్రఫీలో ఏ.ఐ. వినియోగం, టెక్నాలజీ మార్పులు, భవిష్యత్ అవకాశాలపై చర్చలు.
వెడ్డింగ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ :
భారతీయ వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో ప్రతిభ, వినూత్నత, విశిష్టతను గుర్తించే ప్రతిష్టాత్మక అవార్డులు.
జాతీయ స్థాయి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ పోటీ :
ఫోటోగ్రాఫర్లు తమ ఉత్తమ కృతులను ప్రదర్శించి జాతీయ గుర్తింపు పొందేందుకు అవకాశం.
ఫోటోఫినా ట్రేడ్ ఎక్స్‌పో :
కెమెరాలు, లెన్సులు, లైటింగ్, ఆల్బమ్‌లు, సాఫ్ట్‌వేర్, డ్రోన్లు, పోస్ట్ ప్రొడక్షన్ టూల్స్ వంటి ఆధునిక ఉత్పత్తులతో దేశంలోని ప్రముఖ బ్రాండ్ల ప్రదర్శన.
నెట్‌వర్కింగ్, బిజినెస్ గ్రోత్ సెషన్లు :
భాగస్వామ్యాలు, కలబోతలు, వ్యాపార విస్తరణకు ప్రత్యేక వేదికలు.
భారతీయ ఫోటోగ్రఫీ రంగంలో చారిత్రాత్మక ఘట్టం
భారతీయ వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి పూర్తిగా అంకితమైన మొట్టమొదటి జాతీయ స్థాయి వేదికగా ఇండియన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ అండ్ ఫోటోఫినా ఎక్స్‌పో 2026 నిలవనుంది. దేశం నలుమూలల నుంచి వేలాది మంది ఫోటోగ్రాఫర్లు, క్రియేటివ్ ప్రొఫెషనల్స్, ఎగ్జిబిటర్లు హాజరుకానున్నారు. హైదరాబాద్‌ను ఈ కార్యక్రమానికి ఆతిథ్య నగరంగా ఎంపిక చేయడం వెనుక నగరంలోని బలమైన సృజనాత్మక వాతావరణం, సెంట్రల్ యాక్సెస్, జాతీయ – అంతర్జాతీయ ఈవెంట్లకు అనుకూలత కారణాలుగా నిర్వాహకులు తెలిపారు.
