Tuesday, February 10, 2026
Homeఅంతర్జాతీయంPM Modi | ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడిన మోదీ

PM Modi | ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడిన మోదీ

ప్రధాని మోదీ(PM Modi) బుధవారం ఇజ్రాయెల్ ప్రధాని(Israel PM) బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu)తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని ఎక్స్‌లో వెల్లడించారు. ఉగ్రవాదం(Terrorism)పై మరింత దృఢ సంకల్పంతో పోరాడాలనే ఉమ్మడి సంకల్పాన్ని పునరుద్ఘాటించారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని (Strategic Partnership) మరింత బలోపేతం చేసుకునే మార్గాలపై చర్చించారు. “నా స్నేహితుడు, ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడటం, ఆయనకు, ఇజ్రాయెల్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు(New Year Wishes) తెలియజేయడం ఆనందంగా ఉంది” అని మోడీ అన్నారు. “రాబోయే రోజుల్లో ఇండియా-ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి గల మార్గాలపై చర్చించాం” అని అన్నారు. ప్రాంతీయ పరిస్థితులపై కూడా తమ అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నామని మోడీ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News