చివరి మ్యాచ్‌లో కివీస్ ఓటమి
తిరువనంతపురం(Thiruvananthapuram)(కేరళ)లో శనివారం న్యూజిలాండ్(newzealand)తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లోనూ ఇండియా ఘన విజయం(India win) సాధించింది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన మన దేశం 271 పరుగులు చేసింది. 272 రన్నుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్.. 19.4 ఓవర్లలో 225 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో 46 రన్నుల దూరంలో ఓడిపోయింది. మన టీమ్‌లో ఇషాన్ కిషన్ సెంచరీ చేశాడు. 43 బంతుల్లోనే 103 పరుగులు తీశాడు. సూర్యకుమార్ 63, హార్దిక్ పాండ్య 42, అభిషేక్ శర్మ 30 రన్నులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్, కైలె, మిచెల్ చెరో వికెట్, ఫెర్గుసన్ 2 వికెట్లు నేలకూల్చారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో ఫిన్ అల్లెన్ 80, సోధి 33, రచిన్ 30 పరుగులు తీశారు. మన బౌలర్లలో అర్షదీప్ 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అక్షర్ పటేల్ 3, వరుణ్ 1, రింకూ 1 వికెట్ తీశారు.
