ఇండియా అరుదైన ఘనత(Rare Feat) సాధించింది. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ(Economy)గా ఎదిగింది. ఇక, జపాన్(Japan)ను కూడా అధిగమించి 3వ అతిపెద్ద ఎకానమీగా నిలిచేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సంవత్సరాంతపు ఆర్థిక సమీక్ష(Year-End Economic Review)లో ఈ విషయం వెల్లడైంది. నామినల్ జీడీపీ టర్మ్స్(Nominal GDP Terms) ప్రకారం ఇండియా నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. జీడీపీ(GDP) విలువ 4 పాయింట్ ఒకటీ ఎనిమిది ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది. రానున్న రెండున్నర మూడేళ్లలో జర్మనీని కూడా దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. తద్వారా అమెరికా(America), చైనా(China) తర్వాత మూడో అతిపెద్ద ఎకానమీగా నిలుస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. 2030 నాటికి ఇండియా జీడీపీ ఏడు పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని భావిస్తోంది.

