Monday, October 27, 2025
ePaper
Homeతెలంగాణజలమండలిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

జలమండలిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

జలమండలిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం వినియోగదారులు, ఉద్యోగులు, సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్య్రం కోసం త్యాగం చేసిన మహానీయులను స్మరించుకోవాలని, వారి ఆత్మీయ స్ఫూర్తితో దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్, టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్, పర్సనల్ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, సీవీవో గ్యానేందర్ రెడ్డి, సీజీఎంలు, యూనియన్ నాయకులు, ప్రతినిధులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దేశభక్తి గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో వేడుకలు మరింత శోభాయమానంగా జరిగాయి.

RELATED ARTICLES
- Advertisment -

Latest News