గడచిన 5 ఏళ్లలో సుమారు 9 లక్షల మంది భారతీయ పౌరసత్వాన్ని (Indian Citizenship) వదులుకున్నారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి (Minister of State for External Affairs) కీర్తివర్ధన్ సింగ్ (Kirti Vardhan Singh) పార్లమెంట్‌లో వెల్లడించారు. 2011-19లో (8 ఏళ్లలో) 11 లక్షల 89 వేల 194 మంది ఈ బాటలో నడిచారు. గత 14 ఏళ్లలో ఈ సంఖ్య 20 లక్షలకు చేరింది. దీన్నిబట్టి ఇతర దేశాల పౌరసత్వాన్ని ఎంచుకునే విషయంలో ఇండియన్స్ ఆసక్తి కనబరుస్తున్నట్లు కనిపిస్తోంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలనే మోజులో చాలా మంది నకిలీ ఏజెంట్ల బారిన పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి 3505 మంది అనధికారిక ఏజెంట్ల వివరాలను ఇ-మైగ్రేట్ పోర్టల్(E-Migrate Portal)లో చేర్చినట్లు తెలిపింది.
Citizenship | 9 లక్షల మంది ‘ఇండియా’కి గుడ్‌బై
- Advertisement -
RELATED ARTICLES
