Wednesday, February 11, 2026
Homeఆజ్ కీ బాత్హద్దులో ఉండే ఆలోచనలే ముద్దు

హద్దులో ఉండే ఆలోచనలే ముద్దు

సమాజాన్ని ముందుకు నడిపించేది హేతుబద్ధ ఆలోచనలే. అంధ విశ్వాసాలు కాదు. కాలానుగుణంగా నిలబడని విశ్వాసాలను ముమ్మాటికీ వదిలేయాలి. ఎందుకంటే అవి ప్రగతి నిరోధకాలు. ఈ భూమిపై జీవ (మానవ) మనుగడ సక్రమంగా జరగాలంటే జీవవైవిధ్యం ప్రధానం. నేడు గతి తప్పిన స్వార్థపూరిత మానవ కార్యకలాపాల మూలంగానే జనజీవన భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. ఆలోచన పదునైన కత్తి లాంటిది. కత్తితో ప్రాణాలు తీయొచ్చు. అదే కత్తితో శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడొచ్చు. దాన్ని వాడుకునే మనిషి విచక్షణపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఆలోచనలు లోకహితానికి తోడ్పడేలా హద్దులో ఉండాలి.

  • మేదాజీ
- Advertisement -
RELATED ARTICLES

Latest News