Sunday, March 1, 2026
Homeఆరోగ్యంApple | యాపిల్.. పోషకాలు ఫుల్..

Apple | యాపిల్.. పోషకాలు ఫుల్..

ఆరోగ్యం(Health) కోసం రోజుకొక యాపిల్ పండు తినాలి. ఇలా చేస్తే వైద్యుడి(Doctor) దగ్గరకు వెళ్లాల్సిన అవసరం రాదంటారు. యాపిల్‌ ద్వారా సీ విట‌మిన్ (Vitamin C), పీచు, ఖ‌నిజాల‌తోపాటు అనేక ర‌కాల యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. యాపిల్ తింటే ఆకలి కంట్రోల్ అవుతుంది. తద్వారా ఒళ్లు బరువు తగ్గించుకోవచ్చు(Weight Loss). కొలెస్ట్రాల్‌ కూడా తగ్గుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆపిల్స్ పిత్తాశ‌యంలో రాళ్లను నివారిస్తాయి. ఒంటిలోని వేస్ట్‌ను బయటికి పంపిస్తాయి. రోగ‌ నిరోధ‌క శ‌క్తిని(Immunity Power) పెంచుతాయి. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇలా చెప్పుకుంటూపోతే.. యాపిల్ పండు వల్ల ప్రయోజనాలు ఒకటి కాదు రెండు కాదు. చాలా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మన శరీరంలోని దాదాపు అన్ని అవయవాల పనితీరును యాపిల్స్ మెరుగుపరుస్తాయి. జ్యూస్ కన్నా పండు తినటమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News