- మేము ఏది చెబితే అదే చట్టం.. మేం ఏమి చేస్తే అదే చట్టం..
- కన్యకా పరమేశ్వరి గుడి కూల్చివేసి అక్రమ నిర్మాణం..
- కోర్టు ఆదేశాలు ఇచ్చిన ఆగని నిర్మాణ పనులు
- అక్రమ నిర్మాణ పనులను అడ్డుకున్న ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్..
- సికింద్రాబాద్, ఆవుల మంద కన్యక పరమేశ్వరీ గుడి నిర్మాణం పేరుతో భారీ దందా..
- చట్టాలతో పనిలేకుండా ప్రత్యేక కమిటీ ఏర్పాటు..
- కమిటీని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్న ముఠా..?
- హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేసి అక్రమంగానిర్మాణాలు..
- నేటికీ అనుమతి లేకుండా గుడి కూల్చివేసిన వారిపై నమోదు కాని కేసు
- ఎండోమెంట్ కమిషనర్ గారూ మీ ఆధీనంలో ఉన్న గుడులు కూల్చివేస్తే కేసులుండవా..?
- చట్ట ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి..
- డిమాండ్ చేస్తున్న సామాజిక వేత్తలు..
న్యాయ స్థానాలున్నాయి.. కానీ వాటిని గౌరవించే వారు లేరు.. భగవంతుడు వున్నాడని నమ్ముతారు.. కానీ మనసులోని దుర్బుద్ధిని మార్చుకోరు.. ఏకంగా శ్రీ కన్యకాపరమేశ్వరి గుడిని తమ అక్రమ ఆదాయానికి పునాదిగా చేసుకున్నారు.. ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు.. ఉన్న ఆలయాన్ని అక్రమంగా కూల్చేశారు.. నూతన ఆలయ నిర్మాణం పేరుతో భారీగా వసూళ్లు చేశారు..

సికింద్రాబాద్ ఆవుల మంద ప్రాంతంలో ఉన్న కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని అనుమతులు లేకుండా కూల్చివేసి, హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ కొనసాగిస్తున్న అక్రమ నిర్మాణ పనులు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.. అక్రమంగా కమిటీ ఏర్పరచుకొని భక్తి ముసుగులో భక్తుల వద్ద డబ్బులు వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ముఠా వ్యవహారం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..
హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ దర్జాగా పనులు చేస్తుండటంతో నిర్మాణ పనులను చేయద్దంటూ ఆపిన ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్.. కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, నిర్మాణ పనులు ఆపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.. అధికార యంత్రాంగం మౌనం పాటించడం అధికారులకు సమాచారం ఇస్తే కానీ స్పందించక పోవడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. అక్రమంగా అనుమతి లేకుండా కూల్చిన గుడి విషయంలో బాధ్యులపై పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయకపోవడం ఏంటని మండిపడుతున్నారు పలువురు సామాజిక వేత్తలు..
ఇంత దర్జాగా కూల్చిన కేసులు నమోదు చేయకపోవ డంతో ఎండోమెంట్ అధికారులు ఉద్యోగం చేస్తున్నారా.. లేదా అక్రమార్కులకు వంత పాడుతున్నారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.. అధికారుల మౌనం అక్రమార్కులను కట్టడి చేయక పోవడంతో ఎండోమెంట్ అధికారులు అవినీతి చాలా స్పష్టంగా కనిపిస్తుంది.. అక్రమాలు చేస్తున్న విషయం పై పిర్యాదులు ఇచ్చిన పట్టించుకోకపోవడంతో హై కోర్టును ఆశ్ర యించాడు న్యాయవాది నాగిల్ల శ్రీనివాస్..

హైకోర్టు యధాస్థితిలో ఉండాలని ఆదేశాలు ఇచ్చిన దర్జాగా పనులు చేస్తుండటం అధికారుల పరోక్ష సహకారం ఏ మేరకు ఉందో అట్టే అర్థం చేసుకోవచ్చు అన్న సందేహాలు ఉత్పన్నం అవుతున్నాయి.. ఎండోమెంట్ అధికారులకు సమాచారం ఇస్తే ఆర్సీ నెంబర్. 22/2730/2025, ໖:- 05-02-2026 పనులు ఆపినట్లు తెలిపారు.. ఈ మొత్తం వ్యవహారం న్యాయ వ్యవస్థకు సవాల్ గా మారిందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎండోమెంట్ యాక్ట్ 1987 ప్రకారం నేరాలు సెక్షన్ 6 అండ్ 15 ప్రకారం చర్యలు ఉన్న.. సదరు ఆలయం ఎండోమెంట్ శాఖ ఆధీనంలో ఉన్న ఆస్తిగా గుర్తింపు ఉన్న సెక్షన్ 29 30 ప్రకారం.. ఆలయ ఆస్తులను కూల్చడం, మార్చడం, దుర్వి నియోగం చేయడం నేరంమని తెలిసిన దర్జాగా కూల్చివేశారు అక్రమార్కులు.. సెక్షన్ 80 ప్రకారం ఆలయ భూములు లేదా నిర్మాణాలపై అక్రమ ఆక్రమణలు నిషేధం తెలిసే అక్రమాలకు పాల్పడుతున్నరనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి..

సెక్షన్ 83 ప్రకారం అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే క్రిమినల్ చర్యలు ఉంటాయని తెలిసిన దర్జాగా నిర్మాణాలు చేయడం వీరి అవినీతికి అద్దం పడుతుంది.. సెక్షన్ 87 ఆలయ ఆస్తులకు నష్టం కలిగిస్తే శిక్షార్హమైన నేరంమణి తెలిసే చేశారా ఈ వ్యవహారం అనే సందేహాలు సైతం తెరపైకి వస్తున్నాయి.. అతడు అక్రమాలపై ఎండోమెంట్ కమిషనర్ లేదా సంబంధిత అధికారులు కేసు నమోదు చేయాల్సిన బాధ్యత ఉంటుంది..
ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్, 295 ప్రకారం మతపరమైన స్థలాన్ని అపవిత్రం చేయడమేనని తెలుపుతుంది.. ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 295ఏ మత విశ్వాసాలను దెబ్బతీసే ఉద్దేశంతో చేసిన చర్యగా, ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 447 అక్రమ ప్రవేశం అంటే క్రిమినల్ ట్రెస్పాస్ అవుతుం దని తెలిసిన.. ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 120బి కుట్రపూరితంగా ప్రత్యేక కమిటీ పేరుతో ముఠాగా వ్యవహరించిన తీరుపై వర్తిస్తుందని వీరికి తెలిసే చేశారా అన్నది ప్రశ్నార్ధకంగా మారిందనీ ఈ ప్రాంత ప్రజలు అభిప్రాయపడుతున్నారు..

హైకోర్టు ఆదేశాలను బేకాతర చేస్తూ ఇలా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వ్యక్తులపై ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం ప్రకారం తక్షణమే ఎస్ఐఆర్ నమోదు చేసి ఆలయ కూల్చివేతకు బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టీ..హైకోర్టు ఆదేశాలను, ఎండోమెంట్ చట్టాలను, మున్సిపల్, రెవిన్యూ చట్టాలను బేఖాతరు చేసిన అధికారులపై విచారణ జరపి రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్య లు చేపట్టాలని పలువురు సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.. కన్యకా పరమేశ్వరి గుడి కూల్చిన వ్యవహారంలో ఉన్న ఒక బ్యాంకు మేనేజర్ తో పాటు మరికొంతమంది అక్రమాలపై పూర్తి ఆధారాలతో మరొకథనం ద్వారా వెలుగులోకి తేనుంది ‘
