Wednesday, March 4, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంIllegal Crusher | కంకర కుప్పలతో కోట్ల ఆమ్దాని..

Illegal Crusher | కంకర కుప్పలతో కోట్ల ఆమ్దాని..

రాజాపేట మండలం, చల్లూరు సర్వే నం.322/4లో శ్రీని డెవలపర్స్‌ అక్రమ క్రషర్‌

  • గంటకు సుమారు 300 టన్నుల సామర్థ్యంతో క్రషర్‌ పనులు
  • మైనింగ్‌, పొల్యూషన్‌ బోర్డులకు వేర్వేరు డాక్యుమెంట్లు సమర్పించి అనుమతులు
  • జీపీ, తహసీల్దార్‌ల నుంచి ఎలాంటి పర్మిషన్‌ లేవు..
  • విద్యుత్‌ శాఖ రికార్డుల్లో కూడా సరైన అనుమతులు లేవు..
  • గతంలో అక్రమ బ్లాస్టింగ్‌పై కేసు నమోదైనట్టు సమాచారం
  • కలెక్టర్‌కి, మైనింగ్‌ అధికారులకు ఈ అవినీతి కనబడట్లేదా!
  • పర్మిషన్లు లేకుండానే నిర్వహణ.. ఆర్టీఐతో వెలుగులోకి..
  • తక్షణ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్‌

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం చల్లూరు గ్రామంలోని సర్వే నంబర్‌ 322/4లో ఏం జరుగుతోంది? గ్రామ పంచాయతీ పర్మిషన్‌ లేకుండా.. ఎమ్మార్వో ఆఫీస్‌ నుంచి అనుమతి లేకుండా క్రషర్‌ను ఎలా నడిపిస్తున్నారు? ప్రభుత్వ పర్మిషన్‌ లేకుండా ఎలక్ట్రిక్‌ వాళ్లు కరెంటు ఎలా ఇచ్చారు? జిరాక్స్‌ పేపర్లు పెడితే పర్మిషన్‌ ఇస్తారా? ఒక డాక్యుమెంట్‌ మైనింగ్‌ వాళ్లకు పెడితే.. అది కూడా జిరాక్స్‌ కాపీనే పెడితే పర్మిషన్‌ ఇచ్చారు. మైనింగ్‌ వాళ్లకు, కరెంట్‌ వాళ్లకు, పొల్యూషన్‌ బోర్డ్‌ వాళ్లకు సంబంధం ఉండదా? ముగ్గురికి మూడు వేరువేరు డాక్యుమెంట్లు పెడితే ఎలా పర్మిషన్‌ ఇస్తారు?

- Advertisement -

ఆర్టీఐ ద్వారా తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ సఫరర్స్‌ అసోసియేషన్‌ దరఖాస్తు చేయగా ఈ పూర్తి వివరాలు బయటపడ్డాయి. ఈ అక్రమ క్రషర్‌ కెపాసిటీ గంటకు 300 టన్నులు. సంపాదన నెలకు రూ.6 కోట్లు. సంవత్సరానికి రూ.72 కోట్లు. ఈ అక్రమ క్రషర్‌ను ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, సాల్వ్‌ యజమాని జయరాంరెడ్డి, వాళ్ల పరివారం అంతా కలిసి ప్రారంభించారు. ఈ హరి అనే వ్యక్తి ఎవరు అక్రమ క్రషర్‌ నడపడానికి? ఇతని వెనక ఎవరున్నారు? ఎమ్మెల్యేనా? మంత్రినా? లేక, అధికారులా?. ఇది ప్రజల సంపద. దీన్ని అక్రమంగా దోచుకుపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?

ఈ ప్రభుత్వ భూమిలో అక్రమ క్రషర్‌ నిర్మాణం ఎవరి అండదండలతో సాగుతోంది? అధికారులా? ప్రజాప్రతినిధులా? ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్యా? లేక, ఇన్‌ఛార్జ్‌ మంత్రా? లేక, గనుల శాఖ మంత్రి అండదండలతో నడుస్తోందా?. చల్లూరు గ్రామ పంచాయతీ పర్మిషన్‌ లేదని 4/12/2025 నాడు ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆర్టీఐ కింద లెటర్‌ ఇచ్చారు. రాజాపేట తహశీసిల్దార్‌ కార్యాలయం కూడా 11/11/2025 నాడు తమ నుంచి ఎలాంటి పర్మిషన్‌ లేదని లిఖితపూర్వకంగా తెలిపింది. ఎలక్ట్రిక్‌ బోర్డు వాళ్లు 17/ 10 /2025 నాడు తమ కార్యాలయంలో ఎలాంటి డాక్యుమెంట్లు లేవని ఎల్‌ఆర్‌ నంబర్‌ Aణజు/0జూ/Aశ్రీAఱRR/ఖీచీూ/ణ.చీూ/1086 లెటర్‌ ఇచ్చారు.

మైనింగ్‌ డిపార్ట్మెంట్‌ వాళ్లను మోసం చేస్తూ గతంలో అమ్మిన భూమి డాక్యుమెంట్‌ (నంబర్‌ 43/27/2019.. శ్రీని డెవలపర్స్‌ పేరు విూద ఉన్న డాక్యుమెంట్‌) పెట్టి పర్మిషన్‌ తెచ్చారు. ప్రథమ న్యాయస్థానం భువనగిరి కోర్టు వారికి ఎల్‌ఆర్‌ నంబర్‌ 456/ 2020 నాడు ఓఎస్‌ నంబర్‌ 19/2020 నాడు ఈ శ్రీని డెవల పర్స్‌ పేరు విూద సెంటు భూమి లేదని కీ.శే. కర్నాటి నారాయ ణరావు తండ్రి కోటయ్య అఫడవిట్‌ ఇచ్చారు.. ఈ అక్రమ క్రషర్‌ కు 4327/2019 నంబర్‌ గల డాక్యుమెంట్‌నే పెట్టినా మైనింగ్‌ డిపార్ట్మెంట్‌ వాళ్లు లీగల్‌ చూడకుండానే పర్మిషన్‌ ఇచ్చినారు.

తెలంగాణ పొల్యూషన్‌ బోర్డ్‌ వారు 12/11/2025 తేదీన తమ కార్యాలయం నుంచి పర్మిషన్‌ ఉందని లెటర్‌ ఇచ్చారు. కీ.శే. కర్నాటి నారాయణరావు తండ్రి కోటయ్య డాక్యుమెంట్‌ నంబర్‌ 4186/2019 జాస్తి వెంకట సుబ్బారావు పేరు విూద ఉన్న డాక్యుమెంట్‌ పెట్టి పర్మిషన్‌ తెచ్చారు. ఈ డాక్యుమెంట్‌ చెల్లదు. ఎందుకంటే.. మైనింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు ఒక డాక్యుమెంట్‌, పొల్యూషన్‌ బోర్డ్‌వాళ్లకు ఒక డాక్యుమెంట్‌ పెట్టారు. ఈ పర్మిషన్‌ చెల్లదు. ఈ అక్రమ క్రషర్‌ నడిపే హరి ప్రస్తుతం ఎమ్మెల్యే బీర్లు ఐలయ్య బినావిూ. కాబట్టి ఈ క్రషర్‌ను బీర్ల ఐలయ్య, సాల్వో కంపెనీ యజమాని జయరాంరెడ్డి లు ప్రారంభించారు.

ఈ క్రషర్‌కు గతంలో కరెంట్‌ కట్‌ చేశారు. అది కూడా ఎమ్మెల్యే చెబితేనే. మళ్లీ ఆరు నెలల తర్వాత కనెక్షన్‌ ఇచ్చారు. ఈ క్రషర్‌ గంటకు దాదాపు 300 టన్నులు కంకర ఆడిరచే దమ్మున్న క్రషర్‌. దీని ఆదాయం రోజుకు సుమారు రూ.20 లక్షలు. నెలకు రూ.6 కోట్లు. సంవత్సరానికి రూ.72 కోట్లు. ఈ ప్రజాధనం అంతా ఎవరో అనామకులు గండికొడుతుంటే జిల్లా అధికారులకు గానీ మైనింగ్‌ అధికా రులకు గానీ పొల్యూషన్‌ బోర్డు వారికి గానీ పోలీస్‌ శాఖకు గానీ కనపడట్లేదా? ఇందులో వాళ్ల వాటాలుఎంత?. రాజాపేట పోలీస్‌ స్టేషన్లో 2021లో ఈఅక్రమ బ్లాస్టింగ్‌పై కేసు నమోదు అయింది.

అయినా పోలీస్‌ శాఖ వారు పట్టించుకున్నది ఏవిూ లేదు. జిల్లా అధికారులు, మైనింగ్‌ అధికారులు, కలెక్టర్‌ వాటా ఎవరికి ఎంత ముడుతోంది? ఈ ప్రజాధనమంతా ఈ అధికారులు రాక్షసుల్లా భక్షిస్తున్నారు. అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. మైనింగ్‌ మంత్రికి ఈ అక్రమాలు పట్టవా..? అయినా దీన్ని పట్టించుకునే నాథుడు లేడా?. లేకపోతే, వీరికి కూడా వాటాలు అందు తున్నాయా? ఇన్‌ఛార్జి మంత్రి అయినా వీరిపై చర్యలు ఉండవా? ఎన్ని కంప్లైంట్లు చేసినా కలెక్టర్‌కు ఈ 324 సర్వే నంబర్‌ ఎందుకు పట్టదు?

ఇంత పూర్తి సమాచారం ఇచ్చినా కలెక్టర్‌ నుంచి కనీస స్పందన లేదు. మైనింగ్‌ అధికారులు పట్టించుకోవట్లేదు. మైనింగ్‌ శాఖ మంత్రి కూడా ఆయన ముఖ్యమంత్రి ఈ ప్రజాధనంపై స్పందించి పూర్తి వివరాలు తెప్పించుకోవాలి. దుర్వినియోగం జరగకుండా అడ్డుకోవాలి. అక్రమార్కుల నుంచి ఈ ప్రజాధనాన్ని రికవరీ చేయాలి. పర్మిషన్‌ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News