Friday, October 3, 2025
ePaper
Homeతెలంగాణఆల్ఫా హోటల్ వద్ద ఫుట్ పాత్ ను ఆక్రమించి అక్రమ నిర్మాణం

ఆల్ఫా హోటల్ వద్ద ఫుట్ పాత్ ను ఆక్రమించి అక్రమ నిర్మాణం

  • చర్యలు తీసుకొని జిహెచ్ఎంసి అధికారులు
  • ప్రధాన రహదారి పక్కనే ఫుట్ పాత్ ను ఆక్రమించి నిర్మాణం

హైద‌రాబాద్ నగరం నడిబొడ్డున ఫుట్ పాత్ ను ఆక్రమించి అక్రమ నిర్మాణం జరుగుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే జిహెచ్ఎంసి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం జరుగుతుంది. ప్రధాన రహదారి పక్కనే అక్రమ నిర్మాణం జరుగుతుంటె చర్యలు చేపట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. జిహెచ్ఎంసి బేగంపేట్ సర్కిల్ అనుమతులు లేకుండా దాదాపు 20 షాటర్లు వరకు నిర్మాణం సాగుతుంది. ఇంతా జరుగుతున్న ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటే మున్సిపల్ అధికారులు, సిబ్బంది నిర్మాణదారునితో లోపాయకారి ఒప్పందం చేసుకుని చర్యలకు వెనకడుగు వేస్తున్నారని స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పటికైనా సంబంధిత బేగుపేట సర్కిల్ ఉన్నతాధికారులు ఈ అక్రమ నిర్మాణం చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాలి.

RELATED ARTICLES
- Advertisment -

Latest News