Monday, February 16, 2026
Homeవరంగల్‌Mulugu | "బెల్టుషాప్" లు ఆగలే…!

Mulugu | “బెల్టుషాప్” లు ఆగలే…!

  • జోరుగా మరింత దందా!!
  • “మద్యం” అనధికార విక్రయాలు
  • లైసెన్స్‌డ్‌ దుకాణాల నుంచే అక్రమంగా సరఫరా
  • బాటిల్‌పై అదనంగా రూ.40 వసూలు
  • తూతూమంత్రంగా ఎక్సైజ్‌ దాడులు

ములుగుజిల్లా ఏటూరునాగారం ఏజన్సీ ఏరియా పరిధిలో ఉన్న ఆయా ఆరు మండలాల్లో నూతన ఎక్సైజ్ పాలసీ సంవత్సరం నుంచి ఎక్కడ పడితే అక్కడే “బెల్టు”మద్యం షాపులు దర్శనమిస్తున్నాయి. కొందరు అధికార “మద్యం” వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి అనధికారికంగా అక్రమ మద్యం వ్యాపారం దందా కొనసాగిస్తున్నారు. గ్రామ, పల్లె, మండల కేంద్రం అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున “బెల్టు” షాపులు నిర్వహిస్తూ మందుబాబు ల జేబులను గుల్ల చేస్తున్నారు.అసలు షాపుల కన్నా గ్రామాల్లో వెలసిన “బెల్టు” దుకాణాల ద్వారానే మద్యం విక్రయాలు జోరుగా.. హుషారుగా మరింత ఎక్కువగా జరుగుతున్నాయి.

మంగపేట లాంటి 1/70 యాక్ట్ ఉన్న మండలం లో 25 గ్రామపంచాయతీ ల్లో పలుచోట్ల, మరి కొన్నిచోట్ల వ్యాపారులు పోటాపోటీగా ఆలాంటి తమ ఆర్ధిక మద్దతు కూడా ఇచ్చి బెల్ట్ షాపులను ఏర్పాటు చేస్తున్నారు.దీంతో కమలాపురం, మంగపేట, బోరు నరసాపురం, మల్లూరు,తిమ్మంపేట, చెరుపల్లి, రాజుపేట లాంటి పలు ప్రధాన గ్రామాల్లో ఎక్కడికక్కడే ‘బెల్ట్‌ “షాపులు పదుల సంఖ్యలో కనిపిస్తున్నాయి. సిండికేట్‌లు ఒక్కో బాటిల్‌పై రూ.పది నుంచి రూ.15 అదనంగా ఇచ్చి మద్యం కొనుగోలు చేసుకుంటున్నా రు.అదే గ్రామాల్లో అయితే ఒక బాటిల్‌పై అదనంగా రూ.20 నుంచి రూ.30 పెంచి అమ్మకాలు చేపడుతున్నారు.

- Advertisement -

కొన్నిసార్లు డిమాండ్‌ను బట్టి రూ.50 అదనంగా వసూలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. మరోవైపు అడ్డదారిలో సంపాదన కోసం వ్యాపారు లు అడ్డదారులు వెతుక్కుంటున్నారు. ఈ మేరకు బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నా రు.ఏటూరునాగారం మండలంలో మూడు మద్యం దు కాణాలు ఉన్నాయి.కన్నాయిగూడెం మండలంలో రెండు షాపులు ఉన్నాయి.తాడ్వాయి మండలం లోని మూడు ఉండగా, అందులో ఒక దుకాణం నుంచి కేవలం “బెల్ట్‌” షాపులకే మద్యం సరఫరా అవుతుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

వ్యాపారులు సైతం అసలు షాపుల కన్నా గ్రామాల్లో ఉన్న అనధికార “బెల్ట్‌” షాప్‌ల ద్వారా ఎక్కువ మద్యం అమ్మకాలు జరిగేలా చూస్తున్నారు. కిరాణా షాపులు, బడ్డీల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఏ సమయంలోనైనా మద్యం దొరుకుతుంది. బెల్ట్‌ నిర్వాహకు లు లైసెన్స్‌ దుకాణాల్లో మద్యం సీసాలను కొనుగోలు చేసి ఆటోలు, ద్విచక్ర వాహనాలపై గ్రామీణ ప్రాంతాలకు తీసుకొని వచ్చి విక్రయాలు చేపడుతున్నారు.

కొన్ని గ్రామాల్లో మూడు నుంచి ఏడు వరకు మద్యం “బెల్ట్‌” దుకాణాలు ఉన్నాయి.అంటే పరిస్థితి ఏ మేరకు ఉందొ అర్ధం అవుతుంది. “బెల్ట్‌” దుకాణాలను నివారించాల్సిన బాధ్యత ఏటూరునాగారం ఎక్సైజ్‌శాఖ అధికారులపై ఉంది. కానీ,వారు ఎప్పుడు కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు సర్వత్రా నెలకొని ఉన్నాయి.నెలకోసారి ముందస్తుగా సమాచారం ఇచ్చి ఆపై తూతూ మంత్రంగా దాడులు నిర్వహించి చేతులు దులుపుకొంటున్నారని అన్ని గ్రామాల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు బెల్టు షాపులపై తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుకుంటున్నారు.

ప్రతి బాటిల్ పై పైసా వసూల్..

వైన్ షాపుల నిర్వాహకులు , ప్రింటెడ్ ధర కంటే క్వార్టర్‌కు రూ.10, ఫుల్ బాటిల్‌కు రూ.40 చొప్పున అధిక ధరలకు విక్రయి స్తూ మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పెడు తున్నారు. మరికొన్ని గ్రామాల్లో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా మద్యాన్ని అధిక ధరలకు అమ్మి అక్రమంగా డబ్బు లు సంపాదిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News