రక్తపోటు(బీపీ)ని తగ్గించుకోవాలంటే మందుల(Medicines)తోపాటు మంచి ఆహారం (Food) తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారంలో ఉప్పు (Salt) తగ్గించుకోవాలి. ఉప్పును తగ్గించుకోవటం ద్వారా ధమనుల మీద పీడనం తగ్గుతుంది. పొటాషియం(Potassium), క్యాల్షియం(Calcium), మెగ్నీషియం (Megnesium) లభించే ఫుడ్ తీసుకోవాలి. పాలకూర వంటి ఆకు కూరలతో పొటాషియం లభిస్తుంది. ఇది ఒంట్లోని సోడియాన్ని(ఉప్పును) బయటకు వెళ్లగొడుతుంది. ఉప్పు శరీరంలో ఎక్కువ ఉంటే మరింత నీటిని పట్టి ఉంచుతుంది. దానివల్ల రక్తం పరిమాణం పెరిగి, ధమనుల మీద ప్రెజర్ (Pressure) అధికమవుతుంది.
రక్తనాళాలు లూజ్‌గా అవటానికి క్యాల్షియం దోహదపడుతుంది. పెరుగు (Curd) తింటే క్యాల్షియం పొందొచ్చు. కొవ్వు ఉన్న చేపల (Fish) కూర తింటే ఒమేగా3 కొవ్వు ఆమ్లాలూ పెరుగుతాయి. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెగ్నీషియం కోసం గుమ్మడి, అవిసె, సన్‌ఫ్లవర్(Sunflower) గింజల పలుకులు తింటే బీపీ అదుపులోకి వస్తుంది. బీట్‌రూట్(Beetroot), యాపిల్(Apple) పండ్లను 3:1 నిష్పత్తిలో రసం చేసుకొని తాగితే సిస్టాలిక్ బీపీ అతితక్కువ సమయంలోనే తగ్గుతుందని ఒక స్టడీ పేర్కొంది. వెల్లుల్లి తినటం ద్వారా కూడా రక్తపోటు తగ్గుతుంది.
