Sunday, October 26, 2025
ePaper
HomeతెలంగాణTG Government | వివరాలిస్తేనే.. వేతనాలిస్తాం..

TG Government | వివరాలిస్తేనే.. వేతనాలిస్తాం..

ఉద్యోగుల వేతనాల (Wages of employees) విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులందరూ తమ వివరాలను సమగ్రంగా అందజేస్తేనే వారికి అక్టోబర్ వేతనం ఇస్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వానికి వివరాలు ఇవ్వకపోతే వేతనాలు ఆపేస్తామని తేల్చిచెప్పింది. మంత్రివర్గ (Cabinet) నిర్ణయం మేరకు ఉద్యోగులు ఇకపై ప్రతి నెలా 10వ తేదీ లోపు తమ పేర్లు, హోదా, ఆధార్(Aadhar), ఫోన్ నంబర్ (Phone number) వంటి వివరాలు ఇవ్వాలి. ఆర్థిక శాఖ నిర్వహణ పోర్టల్(IFMIS)కు ఆధార్‌ను లింక్ చేయాల్సిందే. అక్టోబర్ 25 అర్ధరాత్రి వరకు అందరూ ఆధార్ లింక్ చేయాలని సెప్టెంబర్‌లో జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆదేశించారు. అక్రమాల నివారణకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మొత్తం 10.14 లక్షల మంది ఉద్యోగులు ఉండగా అక్టోబర్ 16 నాటికి కనీసం సగం మంది కూడా వివరాలు ఇవ్వలేదు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News