Friday, October 3, 2025
ePaper
Homeతెలంగాణకమిషన్లు లేక‌పోతే ప్రతినిధులు పట్టించుకోరా

కమిషన్లు లేక‌పోతే ప్రతినిధులు పట్టించుకోరా

  • కమిషన్లు వచ్చే రోడ్లు, బంగ్లాల పైన ఉన్న దృష్టి పేదల సమస్య పైన ఉండదా…
  • వేసిన బోర్లాతో ఒక్కరోజైనా ప్రజలకు నీళ్లు ఇచ్చారా..
  • నిరుపయోగంగా మరుగున పడ్డ బోర్లు
  • పట్టించుకోని ప్రజాప్రతినిధులు అధికారులు

మల్కాజి గిరి సర్కిల్‌లో కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారుల తీరు చూస్తే ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా? అనే సామెతకు సరిగ్గా సరిపోయే విధంగా ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్‌ నగర్‌ డివిజన్‌ పరిధిలోని ఇందిరా నెహ్రూ నగర్‌, ఈస్ట్‌ ఇంద్ర నెహ్రూ నగర్‌ లో ప్రజలు నీళ్ల కోసం పడరాని కష్టాలు పడుతున్నారు. గతంలో ఇందిరా నెహ్రూ నగర్‌ బీహార్‌ బస్తీలో, ఈస్ట్‌ ఇంద్రా నెహ్రూ నగర్‌ గాంధీ విగ్ర హం పక్కన రెండు బోర్లను నామమాత్రాన వేసి స్థానిక కార్పొరేటర్‌ చేతులు దులుపుకున్నారు. సదరు రెండు బోర్ల కు కరెంటు కనెక్షన్‌ ఇచ్చి ఏ ఒక్క రోజైనా ఈ రెండు బోర్లతో ప్రజలకు నీళ్లు ఇచ్చిన దాఖలాలే లేవు. ఎన్నికల సమ యంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుంటామని చెప్పిన నాయకులు ఇప్పుడు వారి జాడే కనబడడం లేదని బస్తీ వాసులు వాపోతున్నారు. ఎన్నికల సమయంలో ఎలక్ష న్స్‌లో గెలవడానికి వృధాగా ఎన్నో డబ్బులు ఖర్చు చేసే ఈ నాయకులు, ప్రజలకు చిన్న చిన్న సమస్యలు వచ్చిన ప్పుడు వారి సొంత డబ్బులు ఖర్చు చేయడానికి ఆమడ దూరానికి పారిపోతున్నారు. నీళ్ల సమస్య ఉందని సదరు విషయాన్ని పలుమార్లు పత్రికల్లో ప్రచురితమైతే, స్థానిక కార్పొరేటర్‌ ఎమ్మెల్యే తో కలిసి ఉన్నత అధికారులకు మెమొరండం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. బస్తీలలో ఎవరి ఇంట్లో అసలు బోర్లు ఉండవు, పైగా ఎండాకాలం కావడంతో తాగడానికి కూడా నీళ్లు రావ డం లేదని బస్తీ వాసులు తమ గోడును పత్రికా విలేకరు లకు చెప్పుకొని బాధపడుతున్నారు. కమిషన్లు వచ్చే రోడ్లు, బంగ్లాల నిర్మాణాలపై ఉన్న ఆసక్తి, ప్రజలు నీళ్ల కోసం బోర్లు రిపేర్‌ చేయించడం పైన లేదా అని బస్తీ వాసులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా తక్షణమే బస్తీ వాసులకు బోర్లు రిపేరు చేయించి, జలమండలి అధికారు లతో మాట్లాడి నీటి సరఫరా సజావుగా అందేలా కృషి చేయకపోతే, బిందెలతో ప్రజా ప్రతినిధుల ఇండ్లు ఎదుట, జిహెచ్‌ఎంసి కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని, రాబో యే ఎలక్షన్స్‌ల తమకు అండగా నిలవని నాయకులకు బుద్ధి చెబుతామని బస్తీ ప్రజలు హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News