Friday, February 13, 2026
Homeసాహిత్యంLove | ఆదర్శ ప్రేమ 2

Love | ఆదర్శ ప్రేమ 2

ఇప్పుడు మనం మన హీరో మనసులో పడిన మధు character ఎంత అల్లరి చేస్తుందో చూద్దాం. రాధ మాములుగా ఉండలేక పోతున్నాడు చేసే ప్రతి పనిలో మధు గుర్తొస్తుంది. మొత్తం ప్రపంచం అంతా తనలోనే ఉందేమో అనిపిస్తుంది. అది రాధకి చాలా స్ఫూర్తినిచ్చే తలపు కానీ ఎందుకో రాధ భయపడుతున్నాడు. ఒకవేళ ఇదే విధంగా మనసులో అభిమానం పెంచుకుంటే ఎందాకా వెడుతుందో అసలు ఆమె ఎవరు ఎక్కడ ఉంటుంది. వాళ్ళ family ఏంటో ఆమె మనసు ఎలాంటిదో అని.. కానీ రాధకి మాత్రం తను చాలా మంచిదే అయి ఉంటుంది అనిపిస్తుంది.

తన వల్ల మాత్రం ఆమెకు ఏ ఇబ్బంది కలగవొద్దని అనుకుంటాడు. ఆమెకు ఆమెనే వచ్చి మాట్లాడితేనే మాట్లాడాలి అనుకుంటాడు. అప్పటిదాకా ignore చేద్దాం అని అనుకుంటాడు. ఇదిలా ఉండగా మన మధు డిగ్రీ exams రాస్తుంది. Result వచ్చేలోపు కొంత వ్యవధి ఉండటం వల్ల మధు వాళ్ళ స్నేహితులంతా కలిసి computer ఇన్స్టిట్యూట్ లో చేరి కోర్సు complete చేద్దాం అని అనుకుంటారు. మధు కూడా చాలా తపన గల అమ్మాయి కావడంతో స్నేహితులతో కలిసి కోర్సు నేర్చుకోవడానికి సిద్ధమైంది.

- Advertisement -

ఇకపోతే వాళ్ళు అందరూ కలిసి May నెలలో institute లో జాయిన్ అవుతారు.

ఇప్పుడు అసలు నిజమైన ఆత్మీయత మొదలు కానుంది మన మధు ఇంకా రాధ మధ్యలో.. అక్కడ మధులిక రాధకృష్ణ కి student కాబోతుంది.. రాధాకృష్ణ గారు ఆ ఇన్స్టిట్యూట్ లో oracle అదే Database subject teach చేసేవాడు. మధులిక అక్కడ చేరింది ఒక మూడు నెలల కోర్సు కోసం. వాళ్ళు ప్రతిరోజూ ఇన్స్టిట్యూట్ కి వచ్చేవాళ్ళు. ఇక మధుకి అక్కడ మొదటి రోజున, class కి enter అయ్యాడు రాధ. అందరూ నిలబడి wish చేసారు. మధు ని చూసి రాధ కళ్ళల్లో కోటి వెలుగులు వచ్చాయి. కానీ మధు కి మాత్రం ఏం తెలియదు. ప్రశాంతంగా కొత్త కనుక కొంచెం బెరుకుగా ఉంది ఆమె మొహం. ఇక రాధ చాలా ఇబ్బందిగా ఉన్నాడు తన కలల ప్రపంచం తన ముందే ఒక student లా ఉండటం.

అయినా ఏం తెలియనివ్వక యధావిధిగా class మొదలుపెట్టాడు. అందరినీ పేర్లు చెప్పుకొమ్మన్నాడు అందరూ చెప్పారు మధుతో సహా. రాధ చాలా తెలివిగా మధుకి తనపై రాధ దృష్టి ఉన్నట్టు తెలియనిచ్చేవాడు కాదు. Subject లోకి వెళ్లడంతో అంతా interest తో వినటానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు రాధ అందరికీ కలిపి ఒక ప్రశ్న వేసాడు. మనం మాములుగా ఏదైన విలువైన సమాచారాన్ని ఎలా store చేసుకుంటాం అంటాడు. అప్పడు మధులిక చాలా చురుగ్గా documents, files and tables లో store చేస్తాం sir అంటుంది. అప్పుడు రాధ గుండెల్లో గంటలు మ్రోగుతాయి. కానీ ఏం అనకుండా అవునా… అంటాడు కానీ కళ్ళు మాత్రం నవ్వుతుంటాయి. మధుకి ఏం అర్థం కాక silent గా ఉంటుంది..

మరి computer లో ఎలా store చేస్తాం information ని అంటాడు.

అప్పుడు కూడా మధు కి చెప్పాలనే ఉంటది కానీ రాధ గారి తెలివైన మాట తీరుకి భయపడి మౌనం వహిస్తుంది. అప్పుడు రాధ మొత్తం వివరిస్తాడు. మంచి teacher అనుకొని మన మధు as a teacher మన రాధాని mindlo print చేసుకుంటది. ఇక ఆ రోజు class అయిపోతుంది అందరూ వెళ్ళిపోతారు. రాధ కి ఒక studentla మధు ని చూసాక చాలా ఆహ్లాదమ్ కలుగుతుంది. అలా ప్రతిరోజూ రాధ, మధుని తన నడవడికలోని అనుభూతిని పొందుతాడు. ప్రతిరోజూ ఒక గురువుని మధు, తన దేవతను రాధ అలా అనుభూతి లో గడిచిపోతాయి రోజులన్నీ ఆమె చాలా చురుకుగా పాఠాల్ని విని అర్థం చేసుకుంటుంది. ఇలాగే సాగిపోతుంది. ఇక రాధ మధు గురించి తన స్నేహితుల ద్వారా ఎవరికీ అర్థం కాకుండా మొత్తం తెలుసుకుంటాడు. ఆమెకు పాత కాలం పద్దతులంటే చాలా ఇష్టమని తెలుసుకుంటాడు. చక్కగా చదువు పూర్తి చేసుకొని పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవాలని అనుకుంటుందని తెలుసుకుంటాడు.

అందుకు రాధ చాలా గౌరవం పెంచుకుంటాడు తప్పా ఆమెను ఏ విధంగా విసిగించడం చేయడు. అలాగే ఆమె class కి వచ్చినంత కాలం జ్ఞాపకాల్ని నింపుకుంటాడు. ఆ జ్ఞాపకాలు జీవితం మొత్తం పూల పుంత చేసుకొని సాగిపోవాలని నిర్ణయం తీసుకుంటాడు. మధు కూడా ఒక మంచి teacher లాగ రాధ ని మనసులో ముద్రించుకొని అక్కడ కోర్సు complete చేసుకొని వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళు జీవితంలో కలిసింది లేదు మళ్ళీ మాట్లాడుకుంది కూడా లేదు.. కానీ ఆ రాధాకృష్ణ గుండెలో దేవత మాత్రం మధులిక అయిపోయింది ఎప్పటికీ. తను చేసే అన్ని పనులకి ఆమె స్ఫూర్తి నింపుకున్నాడు. అదే ఆదర్శం అంటే అదే అసలైన ప్రేమ అంటే అన్నట్టు. మధులిక కూడా మంచిగా తన గురువులందరి మీద గౌరవం ఉంచినట్టే రాధ మీద ఉంచింది ఆ స్థానం తనకు చాలని రాధ ఆనందం నింపుకున్నాడు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News