Monday, March 23, 2026
Homeహైదరాబాద్‌iBomma | ఐబొమ్మ రవి అరెస్ట్

iBomma | ఐబొమ్మ రవి అరెస్ట్

ఐబొమ్మను తెర వెనక ఉండి నడిపించే ఇమ్మడి రవి(Immadi Ravi)ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్రాన్స్ (France) నుంచి ఇండియా(India)కి వచ్చిన అతణ్ని హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి సీసీఎస్ పోలీసులు (CCS Police) అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కరీబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతని బ్యాంక్ ఖాతాలోని రూ.3 కోట్లను ఫ్రీజ్ చేశారు.

సినిమాలు (Movies) రిలీజ్ (Release) అయిన రోజే పైరసీ (Piracy) చేసి వెబ్‌సైట్‌(Website)లో పెడుతుండటంపై నిర్మాతలు (Producers) చాలా సార్లు ఐబొమ్మ మీద ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ఇటీవల స్పందించిన ఐబొమ్మ నిర్వాహకులు.. తమ జోలికి వస్తే ప్రముఖుల బాగోతాలను బట్టబయలు చేస్తామంటూ బెదిరించినట్లు ఈమధ్య వార్తలు వచ్చాయి. దీంతో పోలీసులు ఛాలెంజింగ్‌గా తీసుకొని ఎట్టకేలకు రవిని అరెస్ట్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News