బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీచేస్తున్న పొన్నం అశోక్ గౌడ్ హామీ
కరీంనగర్, నవంబర్ 12 (ఆదాబ్ హైదరాబాద్): తనను బార్ కౌన్సిల్ ఎన్నికల్లో (Bar Council Elections) గెలిపిస్తే న్యాయవాదుల సమస్య లపై పోరాడతానని పొన్నం అశోక్ గౌడ్ (Ponnam Ashok Goud) హామీ ఇచ్చారు. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ జిల్లా కోర్టుకు వచ్చిన ఆయన్ని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగంపల్లి నాగరాజు శాలువా కప్పి సన్మానించారు. కోర్టు ఆవరణలోని న్యాయవాదుల సమావేశ మందిరంలో పొన్నం అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. 2026 జనవరిలో జరిగే ఎన్నికల్లో బార్ కౌన్సిల్ మెంబర్‌గా పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
న్యాయవాదులు సంపూర్ణ మద్దతు తెలిపి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. జూనియర్ న్యాయవాదులకు స్టైపెండ్(Stipend), సెక్షన్ 41 సీఆర్పీ, వెల్ఫేర్(Welfare), రిటైర్మెంట్ బెనిఫిట్, బీమా (Insurance) రూ.5 లక్షలకు పెంపు, కౌన్సిల్ అకౌంట్ తదితర అంశాలపై బార్ కౌన్సిల్ సమావేశంలో పోరాడతానని చెప్పారు. అందరికీ జవాబుదారీగా, అందుబాటులో ఉంటానని తెలిపారు. కరీంనగర్ జిల్లా కోర్టు తన పుట్టిల్లు అని, అందుకే ప్రచారం ఇక్కడి నుంచే మొదలుపెట్టానని పేర్కొన్నారు.
బార్ అధ్యక్షుడు నాగరాజు, సీనియర్ న్యాయవాదులు పెంచల ప్రభాకర్ రావు, కె.మాధవ రావు, కుసుంబ కృష్ణారావు, పి.అశోక్, జి.మల్లారెడ్డి పటేల్, బాస సత్యనారాయణ, కె.శ్రీనివాస్ రెడ్డి, సొల్లు సత్యం, శ్రీధర్ రావు మాట్లాడుతూ అశోక్ గౌడ్ కరీంనగర్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడిగా, హైకోర్టులో రెండు సార్లు అధ్యక్షుడిగా పని చేసి మంచి పేరు సంపాదించారని తెలిపారు.
ఈ ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తారని అన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ లీగల్ సెల్ చైర్మన్ కల్లేపల్లి లక్ష్మయ్య, లీగల్ సెల్ బాధ్యులు భూక్యా రజనీష్, కొత్త ప్రకాశ్, శంకర్, సృజన్, కూర శ్రీనివాస్ రెడ్డి, ఉప్పల అంజన్ కుమార్, టి.పవన్ కుమార్, సీనియర్ న్యాయవాదులు రాచకొండ ప్రభాకర్, గంజి స్వరాజ్ బాబు, శ్రీనివాస్, పరమేశ్వర్, మహిళా న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
