Saturday, October 4, 2025
ePaper
Homeతెలంగాణఅక్రమ కట్టడాలపై హైడ్రా దాడులు

అక్రమ కట్టడాలపై హైడ్రా దాడులు

మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపా లిటీలోని చెరువుని కొందరు అక్రమంగా ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేశారు, వీటిపై గత ప్రభుత్వంలోనే ఎన్నోసార్లు అధికారులకు లిఖితపూర్వకంగా కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఫిర్యాదులు చేసినా అప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో వచ్చినటువంటి హైడ్రా అధికారులకు మరల ఫిర్యాదు చేయడంతో హైడ్రా కమీషనర్‌ రంగనాథ్‌ సూరం చెరువును శుక్రవారం రోజు అధికారులతో హుటాహుటిన వచ్చేసి చెరువు పరిసరాలను పరిశీలించి మార్కింగ్‌ చేసి శనివారం ఉదయం నుండి చెరువులో నిర్మించిన అక్రమ కట్టడాలనూ కూల్చివేశారు, సూరం చెరువు అక్రమ కట్టడాల కూల్చివేతల విషయం తెలుసుకున్న మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జ్‌ కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు, కాంగ్రెస్‌ ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేశాక చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయాలంటే ఆక్రమణదారులు భయపడుతు న్నారని తెలిపారు, భూకబ్జాదారులపై క్రిమినల్‌ కేసులు, పీడీ యాక్ట్‌ పెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతానని లక్ష్మారెడ్డి చెప్పారు, మహేశ్వరం నియోజకవర్గంలో ఎక్కడైనా ఆక్రమణలు జరిగితే వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కేఎల్‌ఆర్‌ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News