Friday, February 27, 2026
HomeతెలంగాణACB | అవినీతి నిరోధక శాఖ వలలో విధ్యాశాఖ ఉద్యోగి…

ACB | అవినీతి నిరోధక శాఖ వలలో విధ్యాశాఖ ఉద్యోగి…

  • వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ జీ. శ్రీధర్ వెల్లడి..

అవినీతికి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండ్‌గా పట్టుకున్న సంఘటన బుధవారం హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది… ఏసీబీ హైదరాబాద్ రేంజ్ 2, డీఎస్పీ జీ. శ్రీధర్ కథనంప్రకారం… హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ పరిధి పాతబస్తీ బండ్లగూడ మండల విద్యాశాఖ కార్యలయంలో విధులు నిర్వహించే ఉద్యోగి, శివప్రసాద్ వృత్తి జూనియర్ ఆసిస్టేంట్, ఒక ప్రైవేటు పాఠశాలకు చెందిన నిర్వహకుడు ఎస్.ఎస్.సీ బోర్డు పరీక్షల సెంటర్ అలాట్‌మెంట్ పని నిమిత్తం స్థానిక బండ్లగూడ మండల విద్యాశాఖ ఆఫీస్‌లో దరఖాస్తుచేసి అక్కడే విధులు నిర్వహించే జూనీయర్ అసిస్ట్గెంట్ ను సంప్రదించాడు.

దీంతో పనిపూర్తిచేసి నీకు అనుకూలంగా రిపోర్టు ఇవ్వాలంటే రూ.20వేలు ఇవ్వాలని డిమాండ్ చేసాడు. దీంతో బాధితుడు నేరుగా వెళ్లి హైదరాబాద్ రేంజ్ 2, ఆనిషా ఆఫీస్‌లోని అధికారులను సంప్రదించి పనిలో జాప్యం డబ్బుల విషయం అధికారులకు తెలపడంతో వెంటనే రసాయనాలు పూసిన కరెన్సీ నోట్లను బాధితుడికి ఇచ్చి జూనియర్ అసిస్టెంట్ కు ఇవ్వాలని సూచించారు.

- Advertisement -

దీంతో డబ్బులు తీసుకుని నేరుగా వెళ్లి అధికారికి ఇస్తున్న సమయంలో ఆక్కడే మాటేసివున్న ఏసీబీ సిబ్బంది నిందితుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అతని వద్దనుంచి నగదు రూ.10వేలు స్వాధినం చేసుకుని విచారణ అనంతరం కేసు నమోదుచేసి నాంపల్లిలోని స్పెషల్ జడ్జీ ఫర్ ఎస్‌పీఈ ఏసీబీ కేసెస్, కోర్టు న్యాయమూర్తి ముందు హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News