Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeఆంధ్రప్రదేశ్శ్రీశైలానికి పెరిగిన వరద ఉధృతి

శ్రీశైలానికి పెరిగిన వరద ఉధృతి

కొనసాగుతున్న విద్యుత్‌ ఉత్పత్తి

ఎగువ ప్రాంతాల నుంచి చేరుతున్న వరద నీటి కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి వరద వచ్చి డ్యామ్‌లో చేరుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 91,812 క్యూసెక్కుల ఇన్‌ప్లో వస్తున్నది. ఇక అవుట్‌ ప్లో 1,14,709 క్యూసెక్కులుగా నమోదైంది. ఒక స్పిల్‌ వే గేట్‌ ఎత్తి 27,52 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ నుంచి 20 వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ఎడమ గట్టు, కుడిగట్లలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతున్నది. ఎడమగట్టు నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు నుంచి 31,870 క్యూసెక్కులు వరద దిగువకు వెళుతున్నది.

శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 883.80 అడుగుల మేర నీరుంది. డ్యామ్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థం 215.80 టీ-ఎంసీలు కాగా, ప్రస్తుతం 208.72 టీఎంసీల మేర నిల్వ ఉందని అధికారులు తెలిపారు. అయితే, ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఎగువ ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. వర్షాలు ఇలాగే కొనసాగితే కృష్ణా నదికి వరద ఇంకా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News