జహీరాబాద్‌లోని తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల(TMREIS)లో చదివి ఎంబీబీఎస్ (MBBS) సీట్ పొందిన విద్యార్థులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రి & ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) ఆదివారం హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీసు తెలంగాణభవన్(Telangana Bhavan)లో సన్మానించారు. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను శాలువాతో సత్కరించారు(Fecilitaion).

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ గురుకుల పాఠశాలలు పెట్టి మైనార్టీలకు నాణ్యమైన విద్య అందించారని చెప్పారు. తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యా సంస్థల వల్ల మైనార్టీలకు ఎంత లాభం జరిగిందో మీకే బాగా తెలుసని అన్నారు. మైనార్టీ వెల్ఫేర్ స్కూల్లో చదివి తల్లిదండ్రులతోపాటు కేసీఆర్ (KCR) కలను నిజం చేసిన విద్యార్థులను సన్మానించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో 203 మైనార్టీ గురుకులాలు ఏర్పాటుచేసింది కేసీఆర్ అని వెల్లడించారు.
