Wednesday, February 11, 2026
Homeఆరోగ్యంHIV | బీహార్‌లో ఒకే జిల్లాలో 7400 మందికి పాజిటివ్

HIV | బీహార్‌లో ఒకే జిల్లాలో 7400 మందికి పాజిటివ్

సీతామఢీ జిల్లాను వణికిస్తున్న ఎయిడ్స్
బాధితుల్లో 400 మంది చిన్నారులు
తల్లిదండ్రుల నుంచి సోకుతున్న వైరస్

బీహార్‌(Bihar)లో హెచ్‌ఐవీ కలకలం రేపుతోంది. ఒకే జిల్లాలో ఏకంగా 7400 మందికి పాజిటివ్ (Positive) అని తేలింది. బాధితుల్లో 400 మంది చిన్నారులు ఉన్నారు. సీతామఢీ జిల్లా(Sitamarhi District)లో ప్రతి నెలా యావరేజ్‌గా 50 నుంచి 60 కేసులు నమోదవుతున్నాయి. 5 వేల మందికి పైగా రోగులకు చికిత్స అందిస్తున్నారు. జిల్లా ఆసుప‌త్రిలోని ఏఆర్‌టీ సెంటర్‌(ART Center)లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో (Medical Tests) ఈ షాకింగ్ వాస్తవాలు వెలుగు చూశాయి. చిన్నారుల(Children)కు వారి తల్లిదండ్రుల (Parents) నుంచే వ్యాది సోకుతున్నట్లు వైద్యులు (Doctors) తెలిపారు. తల్లిదండ్రులిద్దరిలో ఎవరికి హెచ్‌ఐవీ ఉన్నా పుట్టబోయే పిల్లలకు వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. హెచ్ఐవీపై ప్రజలకు అవగాహన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News