మూడవరోజు కొనసాగుతున్న నిరాహారదీక్షలు
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో చేపట్టిన నిరాహారదీక్షలు మూడవ రోజు కూడా కొనసాగాయి. మూడవ రోజు బాధిత రైతులు కడ్తాల్ గ్రామానికి చెందిన కాంటేకార్ శ్రీనివాస్, మూడ గణేష్, మక్త మాదారం గ్రామానికి చెందిన బండి నాగేష్, పచ్చిపాల శివకుమార్, మర్ల పవన్ లు నిరాహారదీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పవర్ గ్రిడ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వేస్తున్న బీదర్ నుండి మహేశ్వరం 765 కేవీ హైటెన్షన్ లైన్ ను మార్చాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫుచర్ సిటీలో భాగమైన కడ్తాల్ పట్టణం భవిష్యత్తులో అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని తెలిపారు. పవర్ గ్రిడ్ అధికారులు రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, అలైన్ మెంట్ యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతూ వారి ఇష్టారీతిన వేసుకుంటూ ఇక్కడి పెద్ద వెంచర్లను కాపాడుతూ పేద చిన్న సన్న కారు రైతుల పచ్చని పొలాల గుండా వేస్తూన్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు రైతుల సమస్యను పరిష్కరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో రైతులకు సంఘీభావంగా సీఐటీయూ మండల కన్వీనర్ పెంటయ్య, ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు సిద్దిగారి దాసు, కడ్తాల్ మాజీ ఉపసర్పంచ్ కడారి రామకృష్ణ, గూదే రాజేందర్ యాదవ్, గంట శ్రీనివాస్, సీహెచ్.మహేష్, క్యామ రాజేష్, బోసు రవి, గోరేటి కృష్ణ, శ్రీరాములు గౌడ్, క్యామ వెంకటేష్, వెంకట్రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.