Wednesday, March 4, 2026
Homeక్రైమ్ వార్తలుTelangana | హైకోర్ట్ వెబ్‌సైట్ హ్యాక్.. పోలీసులకు ఫిర్యాదు..

Telangana | హైకోర్ట్ వెబ్‌సైట్ హ్యాక్.. పోలీసులకు ఫిర్యాదు..

సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. తెలంగాణ హైకోర్ట్ వెబ్‌సైట్‌ (Telangana High Court Website)ను సైతం హ్యాక్ చేశారు. తీర్పు కాపీల(Order Copies)ను డౌన్‌లోడ్ (Download) చేస్తుండగా ఇంటర్‌నెట్ సేవలకు అంతరాయం కలిగింది. అదే సమయంలో న్యాయస్థానం వెబ్‌సైట్‌లో బెట్టింగ్ సైట్ (Betting Site) దర్శనమిచ్చింది. దీంతో సంబంధిత సిబ్బంది ఉన్నతాధికారులకు చెప్పారు.

దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్ (Registrar) పోలీసులకు ఫిర్యాదు (Complaint) చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి హ్యాకర్ల(Hackers)ను గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నారు. దేశంలోని దాదాపు వర్గాల వారిని, అన్ని వయసుల వారిని ఇట్టే బురిడీ కొట్టిస్తున్న సైబర్ క్రిమినల్స్ చివరికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా టార్గెట్ చేయటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వారి ఆగడాలకు ఇకనైనా అడ్డుకట్ట పడాలని ప్రజలు కోరుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News