Wednesday, March 4, 2026
HomeసినిమాSamantha | రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్న సమంత

Samantha | రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్న సమంత

ప్రముఖ నటి సమంత(Samantha).. రాజ్ నిడిమోరు(Raj nidimoru)ను పెళ్లి చేసుకుంది. ఈ రోజు వేకువజామున కోయంబత్తూరు(తమిళనాడు)లోని లింగ భైరవ ఆలయం(Linga Bhairava Temple)లో వీరి వివాహం జరిగింది. సమంత షేర్ చేసిన ఈ మ్యారేజ్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికరంగా మారాయి. గతంలో అక్కినేని నాగచైతన్య(Nagachaitanya)ను పెళ్లాడిన ఈమె ఆ తర్వాత విడిపోయారు. నాగచైతన్య.. శోభిత దూళిపాళ(Shobitha Dhulipala)ను రెండో పెళ్లి చేసుకోగా, ఇప్పుడు సమంత కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకుంది.

సమంత, రాజ్ కొన్నాళ్లుగా కలిసి జీవిస్తున్నట్లు ఆ నోటా ఈ నోటా అనుకున్నారు. వీళ్లద్దరు కలిసి కొన్ని క్రియేటివ్ ప్రాజెక్టులు చేశారు. అప్పుడే ఫ్రెండ్‌షిప్ ద్వారా దగ్గరైనట్లు వార్తలొచ్చాయి. కొన్నాళ్ల కిందట సమంత, రాజ్ మరింత సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు రావటంతో పెళ్లి చేసుకోబోతున్నారనే గుసగుసలు వినిపించాయి. ఎట్టకేలకే అవే నిజమయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News