1996-97 బ్యాచ్‌కి మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అభినందనలు
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన పేరె రమేష్ కుమార్తె వివాహానికి మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ (karne prabhakar) బాల్య స్నేహితులు సాయం చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. తన బాల్య స్నేహితులంతా కలిసి స్నేహితుడి (Friend) కుమార్తె వివాహాని(Marriage)కి ఆర్థిక సాయం (Financial Help) అందించాలనే నిర్ణయం అభినందనీయమని అన్నారు. స్నేహితుడికి సహాయం చేయడం అంటే అతని మనసు అర్థం చేసుకోవడం, అతని బాధలో ఒక భుజం ఇవ్వడమని అన్నారు. మీ బ్యాచ్‌ని స్ఫూర్తి(Inspiratioin)గా తీసుకొని నేటి యువత ముందుకు సాగాలని కోరారు. అనంతరం 1996- 97 (పదో తరగతి) బ్యాచ్ స్నేహితులంతా ప్రభాకర్‌ను సన్మానించారు.
