Sunday, March 15, 2026
HomeతెలంగాణHigh Court | తప్పుడు పిటిషన్లు వేసి కోర్టు సమయం వృథా చేస్తారా?

High Court | తప్పుడు పిటిషన్లు వేసి కోర్టు సమయం వృథా చేస్తారా?

  • హీరా గ్రూప్ నకు భారీ జరిమానా
  • 5కోట్ల జరిమానా విధించిన హైకోర్టు
  • ఆ మొత్తాన్ని 8 వారాల్లో పీఎం సహాయ నిధికి జమ చేయాలని ఆదేశం

నౌహీరా షేక్‌కు చెందిన హీరా గ్రూప్‌నకు హైకోర్టు భారీ జరిమానా విధించింది. రూ.5 కోట్ల జరిమానా విధించిన న్యాయమూర్తి జస్టిస్‌ నగేశ్‌ భీమపాక… ఆ మొత్తాన్ని 8 వారాల్లో పీఎం సహాయ నిధికి జమ చేయాలని హీరా గ్రూప్‌ను ఆదేశించారు. కోర్టును తప్పుదోవ పట్టించేలా పిటిషన్‌ దాఖలు చేశారని ఆగ్ర హం వ్యక్తం చేసిన న్యాయమూర్తి.. భారీ జరిమానా విధిస్తూ ఉత్త ర్వులు జారీ చేశారు. పేదల నుంచి పెట్టుబడి పేరుతో డబ్బులు వసూలు చేసి తిరిగి చెల్లించలేదని హీరా గ్రూప్‌తో పాటు.. నౌహీరా షేక్‌ పైనా ఈడీ అధికారులు పీఎంఎల్‌ఏ కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు హీరా గ్రూప్‌నకు చెందిన 59 ఆస్తులను అటాచ్‌ చేశారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ఆస్తులను వేలం వేసేందుకు ఈడీ అధికారులు వెబ్‌ సైట్‌లో వివరాలు ఉంచారు. ఈనెల 26న వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. ఈడీ అధికారులు సరిగా వేలం నిర్వహించడం లేదని, ఆస్తుల విలువ తక్కువగా చూపిం చారని నౌహీరా షేక్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వేలాన్ని రద్దు చేయాలని కోరారు. అప్పటి వరకు వేలం వేయ కుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్‌ నగేశ్‌ భీమపాక.. పిటిషనర్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు పిటిషన్లు వేసి కోర్టు సమ యం వృథా చేస్తున్నారన్న న్యాయమూర్తి.. ఈ మేరకు హీరా గ్రూప్‌నకు రూ.5కోట్ల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News