బాల్యంలో భుజానికి మించి బరువాయే. తల్లితండ్రులు కుటుంబ భారాన్ని మోస్తే పిల్లలు పుస్తకాల బరువు మోస్తున్నారు. పదేళ్లు నిండని వయస్సులో పది కిలోలోపైన పుస్తకాల బరువు. బాల్యంలోనే నడుమునొప్పులు కళ్ళకు అద్దాలు, స్కూల్లో పోటాపోటీగా నర్సరీ నుండి పది వరకు ఒక్కరికి పదుల సంఖ్యలో పుస్తకాల అమ్మకాలు.ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో కిలోలో కొద్ది పుస్తకాల బరువుతో ఉదయం సాయంత్రం పిల్లలతో బ్యాగులు పట్టుకొని వెళ్తున్న తల్లిదండ్రులు.నేటి టెక్నాలజీతో పాటు పెరిగిపోతున్న పుస్తకాలు బరువు పేరుకే పరిమితమైన డిజిటల్ క్లాసులు.తరగతి పెరుగుతున్న కొద్దీ పెరిగిపోతున్న పుస్తకాల బరువు.బస్సులు ఆటోలలో వస్తున్న పిల్లలకు బ్యాగులు మోసి శరీర అలసటతో పాటు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.బడి చదువును ఆలోచించే మేదావులు జర ఆలోచించండి.
- శ్రావణ్ కుమార్
