Tuesday, October 28, 2025
ePaper
Homeతెలంగాణతెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు

తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు

రైతులకు ఊరటనిచ్చిన వాన‌లు

పది పదిహేను రోజులుగా వర్షాభావం వల్ల తీవ్రంగా నష్టపోతున్న రైతులకు తాజాగా వాతావరణం ఊరట కలిగించింది. తెలంగాణ వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో కుండపోత వర్షం పడింది. దీంతో రాష్ట్రం మొత్తంలో వర్షాల ప్రభావం కనిపించే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణ కేంద్రం అంచనాలకు అనుగుణంగా పలు జిల్లాల్లో వర్షాలు విస్తరించాయి. రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తుండగా, ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. పంటల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఇది కొంతవరకూ ఉపశమనం కలిగించనుంది.

తదుపరి 2–3 గంటల్లో అదిలాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మెదక్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ పేర్కొంది. గాలి వేగం గంటకు గరిష్టంగా 40 కిలోమీటర్లకు తగ్గే అవకాశముండగా, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అదే విధంగా, హైదరాబాద్‌తో పాటు కొమరం భీమ్ ఆసిఫాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News